ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 42 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26 మంగళవారం భారత్ వాయుసేన పాకిస్థాన్‌పై మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడిలో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారనీ సమాచారమ్. 21 నిముషాల వ్యవధిలో సరిగ్గా పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకి మన భారత్ సేన ఈ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వీర జవాన్లకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు. పాక్‌పై ప్రతీకార దాడిని ప్రశంసిస్తూ అభినందనల వర్షం కురిపించారు. పలువురు యంగ్ హీరోలు జవాన్లకు సెల్యూట్ చేశారు. 'ఇది ప్రతీకారం కాదు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న గొప్ప పోరాటం..' అని సుధీర్‌బాబు స్పందించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి బిగ్ సెల్యూట్ చెప్పాడు.. ప్రబాస్. మన దేశం సరైన సమాధానమిచ్చిందంటూ.. ఎన్టీఆర్ స్పందించారు.
'బ్రేవ్ పైలట్స్‌కి సెల్యూట్' అని మహేష్‌బాబు స్పందించారు. 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెగువను చూసి గర్విస్తున్నా..' అన్నాడు రామ్‌చరణ్. 'రివేంజ్ పై నుండి దించితే కిందికి దిగిపోయింది..' అని యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి అన్నారు. ఇంకా పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు ఈ ఘటనపై స్పందించి తమదైన శైలిలో దేశభక్తిని చాటుకున్నారు.
|