గతంలో ఏదో ఇంటర్వ్యూలో ఓ సందర్భాన్ని అనుసరించి అనుకోకుండా మోహన్‌బాబు నోట్లోంచి వచ్చిన మాట 'ఫసక్'. అంతే ఆ మాట తర్వాత సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు మోహన్‌బాబు ఇంకోసారి ఈ మాటను ప్రస్థావించారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి ఘటనలో మన భారత్ జవాన్లు మృతికి కారణమైన ఉగ్రవాదుల్ని వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసి మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. 21 నిముషాల పాటు ఉగ్రశిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ మెరుపుదాడికి సంబంధించి యావత్ భారతావని జవాన్లను అభినందనలతో ముంచెత్తింది. ఈ దాడినుద్దేశించి, సినీ జనం కూడా తమదైన శైలిలో స్పందించారు. వారిలో సీనియర్ నటుడు మోహన్‌బాబు ప్రత్యేక శైలిలో స్పందించారు.
అసలైన 'ఫసక్' అంటే ఇదే అంటూ ఆయన భారత్ వాయుసేనను ప్రశింసిస్తూ ట్వీట్ చేశారు. 'ఇదే ఫసక్‌కి అసలైన అర్ధం.. గో ఇండియా.. జై హింద్..' అంటూ మోహన్‌బాబు చేసిన ట్వీట్‌లోని 'ఫసక్'తో మరోసారి ఈ పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. నిజానికి అర్ధం పర్ధం లేని ఈ పదానికి అసలు సిసలు అర్ధం ఇప్పుడే వచ్చినట్లైంది. ఇప్పుడు ఈ పదం ట్రెండింగ్‌లో ఉండడానికి అర్హమైన పదంగా మారింది. అదీ మేటర్.
|