Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు. - భమిడిపాటిఫణిబాబు

ఈ వారం ( 29/3 – 4/4 ) మహానుభావులు..


జయంతులు

మార్ఛ్ 29

శ్రీ కాకర్లపూడి నారసింహయోగ పతంజలి :  వీరు, మార్చ్ 29, 1952 న , ఆలమండలో జన్మించారు. తండ్రిగారివద్ద ఆయుర్వేదవైద్యం నేర్చుకున్నారు. చిన్నవయసునుండే తెలుగులో రచనలు మొదలుపెట్టారు. “ పతంజలి పత్రిక “ మొదలుపెట్టి 16 నెలలపాటు నడిపారు. పత్రిక, టివి రంగాల్లో పనిచేసారు.

మార్ఛ్ 31

శ్రీ కపిలవాయి లింగమూర్తి :  వీరు మార్ఛ్ 31, 1928 న , జీనుకుంట లో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చారు..   పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశారు.. 70 కి పైగా పుస్తకాలు రచించారు.. ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది

శ్రీ నటరాజ రామకృష్ణ :  వీరు, మార్ఛ్ 31, 1933 న, ఇండొనీసియా లోని బాలి ద్వీపంలో జన్మించారు. కూచిపూడి నాట్యకళాకారుడు. ఆంధ్రనాట్యము, పదవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం నాట్యాన్ని పునరుద్ధరించారు.. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన నవజనార్దనంను కూడా పునరుద్ధరించారు. ఆజన్మ బ్రహ్మచారి..

 

ఏప్రిల్ 1

శ్రీఏటుకూరి వెంకటనరసయ్య :వీరు ఏప్రిల్ 1, 1911 న , పెదకూరపాడు లో జన్మించారు.  క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, హేతువాది, మానవతావాది, కవి. , పల్నాటి యుద్ధం నేపథ్యంగా పలనాటి వీరచరితము,, అలుగురాజు,  నీతిమంజరి, రైతు హరికథ, సిద్ధాశ్రమము, ప్రేమ లోకం ,  వీరి రచనలు.

ఏప్రిల్ 2

శ్రీ కొచ్చర్లకోట సత్యనారాయణ :వీరు ఏప్రిల్ 2, 1915 న జన్మించారు. తొలితరం తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు వీరు మొదట సినిమాల్లోనూ, ఆ తరవాత నాటకాల్లోనూ నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు.

 

  •  

మార్ఛ్ 29

శ్రీ కొప్పవరపు వెంకట సుబ్బరాయ కవి :తన సోదరుడు, శ్రీ వెంకటరమణ కవి తో కలిసి “ జంటకవులు “ గా ప్రసిధ్ధి చెందారు.  ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు. వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అరగంటలో మనుచరిత్రను ఆశువుగా చెప్పినట్లు తెలుసున్నది

శ్రీ సుబ్బరాయకవిమార్చ్ 29, 1932 న స్వర్గస్థులయారు.

 

మార్ఛ్ 30

  1. శ్రీమతి సురభి కమలాబాయి :  తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని. ఎన్నో తెలుగు, హిందీ చిత్రాలలో నటించి, తమ ప్రతిభ చాటుకున్నారు.

    వీరు మార్ఛ్ 30, 1971 న స్వర్గస్థులయారు.

  1. శ్రీ తడినాధ వెంకట వరప్రసాద్ :  వీరు “ నూతన్ ప్రసాద్ “ గా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రసిధ్ధులు. తెలుగు సినిమాల్లో  హాస్యనటుడిగా, ప్రతినాయకుడు గా ఎంతో పేరుతెచ్చుకున్నారు.  ముఖ్యంగా ప్రసాద్‌ గారిలో  ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్‌ చెప్పినా ఒకే టేక్‌లో 1200 అడుగులు షాట్‌ ఒకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించారు.

   వీరు మార్ఛ్ 30, 2011 న స్వర్గస్థులయారు.. 

 

ఏప్రిల్ 1

శ్రీ మధురాంతకం రాజారాం :    ప్రముఖ కథకులు. ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు. పెక్కు తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన కథలు అనేకం తమిళ, కన్నడహిందీఆంగ్ల భాష లలోకి అనువదించబడ్డాయి.. చిన్ని ప్రంపచం-సిరివాడ నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. 1993 లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

వీరు ఏప్రిల్ 1 , 1999 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
weekly-horoscope march29th to april th