Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

29-03-2019 నుండి04-4-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. సోదరులతో చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు, స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. చిన్న చిన్న విషయాల్లో మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడే అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబసభ్యుల నుండి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు.
 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో మీకు రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన భాగస్వామ్యఒప్పందాల కోసం చేసిన ప్రయత్నాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. ఓపిక అవసరం.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం మిత్రులను కలుస్తారు, వారితో సమయం సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలకు ఆస్కారం కలదు. పెద్దలతో చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానం విషయంలో కీలకమయిన ఆలోచనలు అలాగే నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చర్చల్లో పాల్గొంటారు. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 

ఈవారం సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు చాలామందికి నచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. పూజాదికార్యక్రమాలు చేయుటకు అవకాశం ఉంది. చర్చల్లో పాల్గొంటారు. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సాధ్యమైనంత మేర చర్చపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారితో సమయం సరదాగా గడుపుతారు. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. సోదరుల నుండి వచ్చే సూచనలు మీలో నూతన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంది.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చర్చాపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశాల్లో ఉండే మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. కుటుంబంలో సాధ్యమైనంత మేర నూతన ఆలోచనలు చేయునపుడు జాగ్రత్తగా ఉండుట సూచన. సంతానం నుండి ఆశించిన మేర  లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆత్మీయులను కలుస్తారు, వారితో చర్చలు చేస్తారు. వేచిచూసే ధోరణి మంచిది. 

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

 ఈవారం మిత్రులను కలుస్తారు, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. సోదరులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానం కోసం తీసుకొనే నిర్ణయాలు మీలో నూతన ఆలోచనలను రేకెత్తించే అవకాశం కలదు. ఆరోగ్యం ఒకింత కుదుట పడుతుంది, మీలో నూతన ఉత్సాహాంను నింపుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తండ్రితరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. సంతానం గురుంచి బాగా ఆలోచిస్తారు , ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, కాస్త ప్రయత్నం చేయండి.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. కుటుంబంలో సభ్యులతో సమయం గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది , నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులను బహుమతిగా పొందుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారుల నుండి ఆశించినమేర సహకారం లభిస్తుంది. 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
sarasadarahasam