Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Balayya hit

ఈ సంచికలో >> సినిమా >>

గెలిచిన రోజా.. మంత్రి అయితే వస్తుంది మజా.!

Wins roja .. minister comes maja!

సినీ రంగంలో అందాల తారగా ఓ వెలుగు వెలిగిన రోజా రాజకీయ రంగంలోకి వెళ్లి, తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారక్కడ. ఇప్పుడున్న రాజకీయాల్లో రోజాని రీప్లేస్‌ చేయగల మహిళా నాయకురాలు ఇంకొకర్ని ఊహించలేం. ఎందుకంటే, విషయపరిజ్ఞానం, సమస్యల పట్ల అవగాహన, అన్నింటికీ మించి డేరింగ్‌ అండ్‌ డేషింగ్‌ ఆమెను రాజకీయాల్లో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. వివాదాల సంగతి పక్కన పెడితే, రోజా డైనమిజమే ఆమెను రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కి అత్యంత నమ్మకస్తురాలిగా మారిన రోజా నూటికి నూరు పాళ్లూ జగన్‌ మంత్రి వర్గంలో చోటు దక్కించుకుంటుందనీ సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జబర్దస్త్‌ రోజాకి జబర్దస్త్‌ విక్టరీ దక్కింది. జబర్దస్త్‌ అనే కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నందుకు ఆమెపై చాలా మంది చాలా విమర్శలు చేశారు. కానీ, జబర్దస్త్‌ ప్రోగ్రాంతో ప్రతీ ఇంటికీ చేరువైపోయారు రోజా. రోజా గెలుపులో జబర్దస్త్‌ నవ్వులు కూడా ఎంతో కొంత భాగమై ఉంటాయి. దురదృష్టమేంటంటే, ఇదే ప్రోగ్రాంకి సంబంధించి రోజా సహ న్యాయనిర్ణేత అయిన నాగబాబు మాత్రం ఓడిపోయారు.

మరిన్ని సినిమా కబుర్లు
Pawan Kalyan is zero