Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta is there

ఈ సంచికలో >> సినిమా >>

బాక్సాఫీస్‌ 'హీరో' సిద్ధమైపోయాడు.

The box office 'Hero' is ready.

బాక్సాఫీస్‌కి బంగారు కొండలా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ నుండి సినిమా వస్తుందంటే, ఫ్యాన్స్‌ ఎంతగా ఎదురు చూస్తున్నారో.. ఎన్నెన్ని అంచనాలు పెట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడున్న యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండనే మోస్ట్‌ బిజీగా గడుపుతున్నాడంటే నమ్మి తీరాలండీ బాబూ. బిజీనే కాదు, ఆయన మేనియా కూడా అలాగే ఉంది మరి. లేకుంటే 'రౌడీ' అని ముద్దుగా పిలిపించుకోవడమేంటండీ బాబూ. ఇదిలా ఉంటే, మన రౌడీ గారి కొత్త సినిమా 'డియర్‌ కామ్రేడ్‌' జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మికా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ ఇద్దరూ ఇద్దరే. క్రేజ్‌లో టాపెస్ట్‌ ఆఫ్‌ ది టాప్‌గా తయారయ్యారు.

పవన్‌ కళ్యాణ్‌ సృష్టించిన ట్రెండ్‌ సంగతేమో కానీ, ఈ ఇద్దరూ సృష్టించిన ట్రెండ్‌ అంతా ఇంతా కాదు మరి. తెలుసును కదా. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆల్రెడీ 'గీత గోవిందం' ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూసేశాం. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లోనే వస్తున్న 'డియర్‌ కామ్రేడ్‌' అంతకు మించిన సంచలనాలేవో సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, విజయ్‌ దేవరకొండతో ఫీల్‌ గుడ్‌ డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ ఓ ప్రయోగానికి సిద్ధపడిన సంగతి తెలిసిందా.? లేకుంటే తెలుసుకోండి. అవునండీ ప్లే బోయ్‌లా మనోడ్ని రెడీ చేసి, రొమాన్స్‌తో చంపేయనున్నాడట మన ఈ డైరెక్టర్‌. ఈయన ఎవరో అనుకునేరు.. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఓనమాలు' వంటి విభిన్నమైన సినిమాల్ని తెరకెక్కించినోడే. ఈ సినిమాలో హీరోకి మూడు రకాల లవ్‌స్టోరీస్‌ కనెక్ట్‌ చేయనున్నాడట. మూడూ బ్రేకప్‌ లవ్‌ స్టోరీసేనట. అందుకే ఈ సినిమాకి 'బ్రేకప్‌' అనే టైటిల్‌ అనుకుంటున్నారట. మరోవైపు మనోడు మెగాస్టార్‌ టైటిల్‌ 'హీరో'పై కన్నేసి, తన ఇంకో కొత్త సినిమాకి ఇదే టైటిల్‌ని కన్‌ఫామ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆనంద్‌ అన్నామలై ఈ సినిమాకి దర్శకుడు. కొత్త భామ మాళవికా మోహనన్‌ రౌడీ బాస్‌తో జోడీ కడుతోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam