సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సున్నా చుట్టేశాడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయాడు. ముఖ్యమంత్రి పీటం సంగతి దేవుడెరుగు. అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు జనసేనాని. అత్యంత దారుణమైన పరాజయమిది పవన్ కళ్యాణ్‌కి. అన్నయ్య చిరంజీవి ప్రజార్యాజం పార్టీ స్థాపించి, ముఖ్యమంత్రి పీటమెక్కకపోయినా, చెప్పుకోదగ్గ స్థాయి¸లో సీట్లు దక్కించుకున్నారు. 'నేను అన్నయ్యలా కాదు..' అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశం అభిమానుల్ని ఉత్సాహపరిచిందే కానీ, ఓటర్లను మెప్పించలేకోపోయింది.
పాతికేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ముందే ఊహించుకుని, లెక్కలేసుకుని, రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పిన జనసేనాని పాతికేళ్లు కాదు కదా.. తన రాజకీయ ప్రస్థానాన్ని ఇంకొక్క ఏడాది అయినా కొనసాగించగలరా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముందున్న అనేకానేక శేష ప్రశ్నలకు సమాధానమిచ్చేదెవరు.? సినీ రంగంలో అన్నయ్యను మించిన తమ్ముడు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో మాత్రం అన్నయ్య గౌరవాన్ని నిలబెట్టలేకపోయారు. చిరంజీవి ఈ విషయంలో ముందే జాగ్రత్త పడ్డారేమో.. జనసేన పార్టీతో ఏమాత్రం సంబంధాలు పెట్టుకోలేదు.
|