Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The box office 'Hero' is ready.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో గుండుతో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు నటి. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో అగ్ర కుటుంబానికి చెందిన హీరోలకు సంబంధించి రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలూ ఆశించిన గుర్తింపు తీసుకురాలేదు ఈ నటికి. ఓ సినిమా అయితే, అగ్రహీరో తనయుడు నటించిన సినిమా. దురదృష్టవశాత్తూ ఆ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఎవరో గుర్తు పట్టారా.?

లేదంటే మరో చిన్న హింట్‌. తెలుగులో చాలా సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌ ఈ సినిమాకి దర్శకుడు. అయినా కానీ వర్కవుట్‌ కాలేదు. అవకాశాలైతే వచ్చాయట. కానీ, ఎందుకో ఒప్పుకోలేదట. మళ్లీ అవకాశం వస్తే ఈ సారి రిజిస్టర్‌ అయ్యే పాత్రలో నటిస్తానని చెబుతోంది. ఇంత చెప్పినా ఈ నటిని గుర్తించడం కష్టమేనంటారా.? అయితే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. అప్పుడు గుండుతో కనిపించినా, ఇప్పుడు చాలా అందగత్తెగా మారిన ఈ నటి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు