సమంత ఉంటే సినిమా హిట్ అయిపోయినట్లే. ఇప్పుడు జనాల్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఇదే. జనాల్లోనే కాదు, ఇప్పుడు దర్శక, నిర్మాతల్లో కూడా ఇదే కాన్ఫిడెన్స్ నెలకొంది. ఎందుకంటే సమంత టైమ్ నడుస్తోందిప్పుడు. సమంత లక్ ఆ రేంజ్‌లో ఉంది మరి. సమంత కనిపిస్తే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే. అది గ్లామర్ రోలా.? హారర్ రోలా.? ఇంకేమైనానా.? నో వే సమంత ఉంటే చాలంతే. ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు సమంత రూపంలోనే హిట్ దక్కింది. ఇప్పుడు మామగారి టర్న్. ఈ టర్న్‌లో నాగార్జునకూ సమంత హిట్ ఖాయమని ఆల్రెడీ ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా తన షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నానని సమంత ట్విట్టర్‌లో పేర్కొంది. ఎప్పటికప్పుడే తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చే సమంత తాజా ట్వీట్ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ముఖ్యంగా నాగ్ ఫ్యాన్స్‌కి ఇది బూస్టప్ ఇచ్చే స్టఫ్ మరి. ఫ్యామిలీ పట్ల సమంత ఎంత బాధ్యతగా ఉందో ఈ విషయాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. రియల్ లైఫ్‌లోనే కాదు, రీల్ లైఫ్‌లో కూడా సమంత తన ఫ్యామిలీకి ఇస్తున్న ఇంపార్టెన్స్‌కి నిదర్శనమిది. స్టార్ట్ చేసినప్పటి నుండీ, ఇప్పటిదాకా షూటింగ్‌కి ఎక్కడా బ్రేకులు లేకుండా చూసుకుంటోంది చిత్రయూనిట్. దాంతో అనుకున్న టైంకే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
|