Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

'సాహో'రే మార్పు మంచిదేనంటున్నారే.!

sahore changes

పెద్ద సినిమాలూ, భారీ బడ్జెట్‌ సినిమాల విషయంలో టెక్నీషియన్లు మధ్యలో మారిపోతుండడం సహజమే. ముఖ్యంగా మ్యూజిక్‌ కి సంబంధించి ఈ మార్పు సహజంగా జరుగుతూంటుంది. మ్యూజిక్‌ విభాగానికి చెందిన వారు ఒక్కరే ఉండరు. ఒక్కోసారి ఒక్కొక్కరిని పార్ట్‌, పార్ట్‌లుగా తీసుకుంటుంటారు. అయితే, ఈ మార్పు అందరికీ నచ్చుబాటు కాదు. గతంలో 'గౌతమీ పుత్రశాతకర్ణి' సినిమాకి మొదట్లో దేవిశ్రీ ప్రసాద్‌ని తీసుకున్నారు. కానీ చివరికొచ్చేసరికి ఆ స్థానంలో చిరంతన్‌ భట్‌ని ఫిక్స్‌ చేశారు. ప్రజెంట్‌ నిర్మాణంలో ఉన్న 'సైరా' ప్రాజెక్ట్‌కీ మొదట్లో రెహ్మాన్‌ని అనుకున్నారు. ఇప్పుడు అమిత్‌ త్రివేది ఫిక్స్‌ అయ్యాడు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, లేటెస్ట్‌గా 'సాహో' సినిమాకి మ్యూజిక్‌ షాక్‌ తగిలింది మరి.

ఇంతవరకూ మ్యూజిక్‌ విభాగంలో కొనసాగిన శంకర్‌, ఎహ్సాన్‌, లాయ్‌ అని మ్యూజిక్‌ త్రయంగా పిలవబడే వీరు 'సాహో' టీమ్‌ నుండి తప్పుకున్నారు. అందుకే మనం చెప్పుకుంటున్న ఈ టాపిక్‌ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. అసలింతకీ ఈ మ్యూజిక్‌ త్రయం ఎందుకు 'సాహో' టీమ్‌కి హ్యాండిచ్చారయ్యా అంటే, ఛాప్టర్స్‌ పేరుతో రిలీజ్‌ అవుతున్న 'సాహో' టీజర్స్‌కి వేర్వేరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ని వాడుకుంటున్నారట సుజిత్‌ అండ్‌ టీమ్‌. అలా 'సాహో' ఛాప్టర్‌ 1, 2 లకు గిబ్రాన్‌ సంగీతమందించారు. అది ఈ మ్యూజిక్‌ త్రయానికి నచ్చడం లేదట. మేము ఈ సినిమాకి పని చేశామని గొప్పగా చెప్పుకోవాలి అంటే, ఆ విభాగానికి సంబంధించిన అన్ని పనులూ తమ చేతిమీదే జరగాలనేది వీరి వాదన. అక్కడే అసలు రచ్చ మొదలైంది. ఇష్టం లేని సంసారం.. అంటూ వెనకటికి అదేదో సామెత చెప్పినట్లు ఇష్టం లేని చోట మసలడం కష్టమే కదా. అందుకే సింపుల్‌గా వీరు ఎస్కేప్‌ అయ్యారు. ఫ్రెండ్లీగానేలెండి. దాంతో రిలీజ్‌ డేట్‌ దగ్గర పడిన 'సాహో'కి పూర్తి మ్యూజిక్‌ కంపోజేషన్‌ బాధ్యత గిబ్రాన్‌ మీదే పడిందనీ తాజా సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
Do you play together?