Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Do you play together?

ఈ సంచికలో >> సినిమా >>

'మల్లేశం' ఎక్కడో టచ్‌ చేసేశావ్‌.!

Mallesam  tapped somewhere.

ప్రియదర్శి అంటే ఇంతవరకూ కమెడియన్‌గానే తెలుసు. కానీ, ఆయనలో ఈ యాంగిల్‌ చూశారా.? ఈ యాంగిల్‌లో ప్రియదర్శి పర్‌ఫామెన్స్‌ అదరగొట్టేస్తున్నాడు మరి. అదేనండీ తెలంగాణా చేనేత కార్మికుడు చింతకింది మల్లేశంగా ప్రియదర్శి తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు 'మల్లేశం' సినిమాతో. ఓ సాధారణ చేనేత కార్మికుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగాడు.. అనేదే 'మల్లేశం' సినిమా కథ. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌తో సినిమా థీమ్‌ మొత్తాన్నీ బాగా కట్‌ చేసి చూపించారు. ఏదో బయోపిక్‌ కదా.. అదీ ఆనాటి కాలం నాటి బయోపిక్‌ కదా.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేవనుకుంటారో ఏమో, అయితే తప్పులో కాలేసినట్లే. అన్నిరకాల ఎమోషనల్‌ విత్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో 'మల్లేశం' తెరకెక్కింది. జూన్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తనదైన టైమింగ్‌తో తెలంగాణా యాసలో వెటకారపు డైలాగులు పండించే ప్రియదర్శి, చింతకింది మల్లేశం పాత్రలో నటించడం కాదు, జీవించేశాడు.

ప్రియదర్శికి ఈ సినిమా నెక్స్‌ట్‌ లెవల్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది. రాజ్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఝాన్సీ మల్లేశం తల్లి పాత్రను పోషిస్తోంది. చాలా హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాపులర్‌ సెలబ్రిటీస్‌ బయోపిక్స్‌కే సహజంగా ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. కానీ, విచిత్రంగా 'మల్లేశం' బయోపిక్‌ పైనా అనూహ్యమైన ఆశక్తి నెలకొంది. చూడాలి మరి విడుదల తర్వాత 'మల్లేశం' ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటాడో.

మరిన్ని సినిమా కబుర్లు
'SIRA' filter has started.