Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Mallesam  tapped somewhere.

ఈ సంచికలో >> సినిమా >>

'సైరా' వడపోత మొదలైంది.!

'SIRA' filter has started.

తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా' చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన టీజర్‌ సంచలనాలు సృష్టించింది. ఇక రెండో టీజర్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ టీజర్‌ కోసం సైరా టీమ్‌ కసరత్తులు మొదలుపెట్టింది. దాదాపు చివరికి చేరిన షూటింగ్‌ పార్ట్‌ నుండి, బెస్ట్‌ సీన్స్‌ని ఫిల్టర్‌ చేసి, ఈ టీజర్‌లో చూపించబోతున్నారట. ఆ బెస్ట్‌ సీన్స్‌ అన్నీ మ్యాజికల్‌ మూమెంట్స్‌గా ఉంటాయట. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ నెవ్వర్‌ బిఫోర్‌ అనే విధంగా ఉంటుందట. అమిత్‌ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తొలి టీజర్‌లో చిరంజీవినే హైలైట్‌ చేసి చూపించారు. ఈ రెండో టీజర్‌కి వచ్చేసరికి నయనతారతో పాటు, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌ కూడా కనిపించబోతున్నారట. మిగతా వాళ్లు కనిపించకపోవచ్చు. అతి త్వరలో ఈ టీజర్‌ వదిలేందుకు 'సైరా' టీమ్‌ గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్‌ రెడ్డి ఈ చారిత్రక ఘట్టాన్ని తనదైన శైలిలో ఎంత మాత్రమూ స్టైల్‌ మించకుండా తెరకెక్కిస్తున్నాడు. ఔట్‌ పుట్‌ చాలా చాలా బాగా వచ్చిందనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. మెగా మగధీరుడు రామ్‌చరణ్‌ ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
The second 'yatra' is the sky.