'సైరా నరసింహారెడ్డీ.. సై సైరా..' అంటూ సైరాకి గుమ్మడికాయ కొట్టేశారు. ఎట్టకేలకు 'సైరా' షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓ యజ్ఞం ముగిసిపోయింది. తర్వాతి పనుల్లో సైరా టీమ్ బిజీ అయిపోయింది. చారిత్రాత్మక చిత్రం కావడం, అందులోనూ ఫ్రీడమ్ ఫైటింగ్‌కి సంబంధించి కాన్సెప్ట్ కావడంతో, యుద్ధ సన్నివేశాలకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దాంతో ఎంత నేచురల్‌గా చిత్రీకరణ జరిపినా, ఎంతో కొంత విజువల్ అద్భుతం చేయాల్సిందే. అందుకే ప్రస్తుతం ఆ అద్భుత ఘట్టానికే సైరా రంగం సిద్ధం చేసింది. ఆల్రెడీ విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి.
ఈ సినిమాకి నిర్మాత అయిన చరణ్ ఆయా పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక రిలీజ్ డేట్.. ఇంత గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గాంధీ జయంతి కన్నా గొప్ప రోజు ఇంకేముంటుంది చెప్పండి. అందుకే అక్టోబర్ 2న 'సైరా' విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని చిరంజీవి తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తదుపరి సినిమా ఉండనుందన్న సంగతి తెలిసిందే. 'సైరా' మూడ్ నుండి బయటికొచ్చిన చిరంజీవి, కొరటాల సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆ అంశాలు 'సైరా'లో ఎక్స్‌పెక్ట్ చేయలేం. అది పూర్తిగా వేరే జోనర్ మూవీ. కానీ, కొరటాల సినిమాలో చిరంజీవి నుండి అభిమానులు ఏం కోరుకుంటారో, అవన్నీ తీర్చనున్నాడట డైరెక్టర్ కొరటాల. మరోవైపు ఈ సినిమాలో చిరు సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరా.? అని చర్చలు కొనసాగుతున్నాయి. ఆ లిస్టులో కైరా అద్వానీ, రకుల్ ప్రీత్‌సింగ్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి, చిరుతో చిందేసే ఆ అదృష్టవంతురాలు ఎవరో.!
|