ఆరోగ్యం బావుండక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు, నెక్ట్స్‌డేకి పలానా నటుడు, లేదా నటి మృతి చెందారు.. అంటూ మరణ వార్తలు ఈజీగా సర్క్యులేట్ చేసేస్తున్న రోజులివి. సోషల్ మీడియా పుణ్యమా అని తెగ వైరల్ అయిపోతున్న ఆ న్యూస్‌కి సదరు వ్యక్తి బెడ్‌పై ఉన్నా, కానీ, 'నాకేం కాలేదు మొర్రో, నేను బాగానే ఉన్నాను..' అని రెస్పాండ్ కాకుంటే, ఆ వ్యక్తి ఆ రోజుతో చచ్చిపోయినట్లే. అలా తగలబడింది సోషల్ కర్మ. అసలు మ్యాటరేంటంటే, ఈ మధ్య స్వీటీ బ్యూటీ అనుష్క కాలికి గాయమైందంటూ ఓ గాలి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసింది. నిజంగానే అనుష్కకు గాయమైందా.? అని ఆమె అభిమానులు కాస్త బాధపడ్డారు ఈ వార్త విని. ఈ గాలి వార్తకు స్టోరీ కూడా అల్లేశారు మన సోషల్ ప్రబుద్ధులు. 'సైరా' సెట్‌లో అనుష్క గాయపడిందనీ ప్రచారం చేశారు.
దాంతో ఈ వార్త ఆ నోటా, ఈ నోటా అటు అనుష్క దాకా చేరింది. ప్రస్తుతం 'సెలెన్స్' సినిమా కోసం షూటింగ్‌లో ఉన్న అనుష్క ఈ గాలి వార్తకు ఇమీడియట్‌గా స్పందించాల్సి వచ్చింది. 'నేను బాగానే ఉన్నా, సియాటెల్‌లో హ్యాపీగా షూటింగ్ చేస్తున్నా, లవ్ యూ ఆల్' అని అదే సోషల్ ఇంట్లో ట్వీటేసింది. దాంతో స్వీటీ అభిమానులు హమ్మయ్యా అనుకున్నారు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసిన వారి నోటికి సారీ, సారీ చేతికి తాళాలు పడినట్లైంది. తూచ్ అంతా ఉత్తదే.. స్వీటీ బాగానే ఉందట.. అనే వార్తను ఇప్పుడు రీ లోడ్ చేస్తున్నారు. అదీ సంగతి. 'సైరా'లో స్వీటీ కీలక పాత్ర పోషిస్తున్నదన్న సంగతి తెలిసిందే. తక్కువ నిడివి ఉన్న పాత్ర అది. తదుపరి, స్వీటీ నటిస్తున్న బహుభాషా చిత్రం 'సైలెన్స్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ నుండే అనుష్క తాజా రిప్లై ఇచ్చింది సోషల్ నెటిజన్ ఫ్యాన్స్‌కి. హేమంత్ మధుకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, కోనవెంకట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మాధవన్ హీరోగా నటిస్తుండగా, అంజలి, షాలినీ పాండే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|