హీరోయిన్స్‌కి తెరపై పర్‌ఫామ్ చేయడం ఒకెత్తు, ఆయా పాత్రలకు తమ గొంతును మ్యాచ్ చేయడం ఇంకో ఎత్తు. కెరీర్ మొదట్నుంచీ సమంతకు సింగర్ చిన్మయి శ్రీపాద తన గొంతు అరువిస్తోంది. సమంత అంటే అదే గొంతు. ఆ గొంతు వింటే సమంతనే గుర్తొచ్చేలా ఉంటుంది ఆ గొంతు. అలా సమంతకు, శ్రీపాదతో ప్రత్యేకమైన అనుబంధముంది. ఒకప్పుడు సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి ఫుల్ స్వింగ్‌లో ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకు కారణం 'మీ టూ' మూమెంట్. తమిళ రచయిత వైరముత్తుపై ఎప్పుడయితే చిన్మయి 'మీ టూ' ఆరోపణలు చేసిందో అప్పటి నుండీ కాంట్రవర్సీకి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది చిన్మయి. తమిళ డబ్బింగ్ యూనిట్ నుండి ఆమెను తొలగించివేశారు.
అంతేకాదు, ఆ తర్వాత చిన్మయి చాలా చాలా అవమానాలు ఎదుర్కొంది. ఎదుర్కొంటూనే ఉంది. ఈ విషయమై తాజాగా చిన్మయిని సపోర్ట్ చేస్తూ సమంత కొన్ని స్టేట్‌మెంట్స్ సెలవిచ్చింది. చిన్మయిలా నిజాలు బయటపెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం చేసిన చిన్మయి అంటే అందుకే తనకు అంత ప్రత్యేకమైన అభిమానం అని చెప్పుకొచ్చింది. ధైర్యంగా ఓ సమస్యపై పోరాడుతున్న మహిళకు ఇలాంటి అవమానాలు రాకూడదని సమంత పేర్కొంది. అయితే, చిన్మయిపై గత కొంతకాలంగా వ్యతిరేకత ఉంది. సోషల్ వేదికపై ఆమెను ఓ ఆటాడేసుకుంటున్నారు. అది కాస్తా ఈ మధ్య శృతిమించింది కూడా. ఇంతవరకూ ఈ విషయాలపై స్పందించని సమంత, తాజాగా ఈ విషయంపై స్పందించింది. చిన్మయికి సపోర్ట్‌గా నిలిచింది. ఓ స్టార్ హీరోయిన్‌గా సమంత తీసుకున్న ఈ స్టాండ్ చిన్మయి కెరీర్‌కి ఎంత మాత్రం కలిసొస్తుంది.? చూడాలి మరి. ఇదిలా ఉంటే, సమంత ప్రస్తుతం 'ఓ బేబీ' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా సమంతకు ప్రత్యేకం. ఒకవేళ 'ఓ బేబీ' హిట్ అయ్యిందంటే సమంత కెరీర్‌లో ఇదో మరిచిపోలేని మైలురాయిగా నిలుస్తుందడం అతిశయోక్తి కాదేమో. సినీ ప్రముఖుల నుండి, సినీ ప్రియులంతా ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. జూలై 5న 'ఓ బేబీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|