ప్రీ లుక్స్, ప్రీ టీజర్స్ అంటూ సినిమాల విడుదలకు ముందు హీరో పాత్రల్ని రివీల్ చేయడం పరిపాటే. అయితే, 'వాల్మీకి' సినిమా ప్రీ టీజర్‌కి చేసినంత హంగామా అంతా ఇంతా కాదండోయ్. త్రీ డేస్ టు గో, టూ డేస్ టు గో.. త్రీ అవర్స్ టూ గో.. వన్ అవర్ టూ గో.. అంటూ సోషల్ మీడియా అంతా నింపేశారు 'వాల్మీకి' ప్రీ టీజర్ కోసం. అందుకు తగ్గట్లుగానే ఆ ప్రీ టీజర్ ఏదో రానే వచ్చింది. ఇంతకు ముందెన్నడూ చేయనంత హడావిడి చేస్తున్నారు.. ఇది చాలా టూ మచ్ అంటూ అంతవరకూ విమర్శించివారు కూడా ఆహా.. ఓహో అనడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. అందరికీ అంతలా షాకిచ్చింది ఆ ప్రీ టీజర్. అదేమి టీజర్ అండీ బాబూ.. అందులో ఉన్నది అసలు వరుణేనా.? అయితే, ఆ మేకోవర్ ఏంటండీ బాబూ.. అంటూ ఆశ్చర్యపోవడం తప్ప విమర్శించడానికేమీ లేకుండా పోయింది
ఆ టీజర్‌లో. అంతలా వాల్మీకి గెటప్‌కి అందం తెచ్చేశాడు వరుణ్. వాల్మీకి అంటే ఓ రుషి పేరు. కానీ ఇక్కడ మన వాల్మీకి మాత్రం ఓ గ్యాంగ్‌స్టర్. గ్యాంగ్‌స్టర్ అంటే అబ్బో చాలా పవర్‌ఫుల్ అనుకునేరు. అయితే తప్పులో కాలేసినట్లే. ఇంత భారీ గెటప్ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ ఫుల్ ఫన్ జనరేట్ చేయబోతున్నాడట తెలుసా.! ఇంతకీ ఈ సినిమాలో హీరో, అధర్వ మురళి. కానీ, ప్రధాన పాత్రధారుడు మాత్రం మన వాల్మీకిగారు అదేనండీ వరుణ్ తేజ్‌నే. ఈ పాత్ర చుట్టూనే అసలు కథ తిరుగుతుంది. ఈ పాత్రపై అందుకే డైరెక్టర్ అంత దృష్టి పెట్టాడు. ఆ పాత్రలో నటించేందుకు వరుణ్‌లాంటి హీరోని వెతికి పట్టాడు. 'ఎఫ్ 2'లో మనోడి ఫన్ టాలెంట్ చూశాం కదా. అంతకు మించి ఫన్ ఈ సినిమాలో చూపించబోతున్నాడట. నిజానికి ఇది ఓ రీమేక్ సినిమా. స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడెప్పుడో తెలుగులోనూ ఈ తరహా చిత్రం (చిక్కడు దొరకడు) వచ్చేసింది. అయితే, హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ 'వాల్మీకి' మాత్రం మరిన్ని సరికొత్త షాక్‌లు ఇవ్వబోతోంది. వరుణ్ కోసం ఒరిజినల్ కంటెంట్‌లో చిన్నా, చితకా మార్పులు చాలానే చేశారు. అవేంటో మాత్రం తెరపై చూడాల్సిందే. హరీష్ శంకర్ కెరీర్‌లో ఇది రెండో గబ్బర్‌సింగ్ అవుతుందంటున్నారు.
|