Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
hippi  churaka

ఈ సంచికలో >> సినిమా >>

కల్కి చిత్రసమీక్ష

kalki movie review

చిత్రం: కల్కి
నటీనటులు: రాజశేఖర్‌, ఆదా శర్మ, నందిత శ్వేత, నాజర్‌, అశుతోష్‌ రాణా, శత్రు, సిద్ధు జొన్నలగడ్డ, రాహుల్‌ రామకృష్ణ, చరణ్‌ దీప్‌, పూజిత పొన్నాడ తదితరులు.
సంగీతం: శరవణన్‌ భరద్వాజ్‌
ఎడిటింగ్‌: గౌతమ్‌ నేరుసు
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
నిర్మాత: సి.కళ్యాణ్‌
నిర్మాణం: హ్యాపీ మూవీస్‌
దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ
విడుదల తేదీ: 28 జూన్‌ 2019
క్లుప్తంగా చెప్పాలంటే..
కొల్లాపూర్‌లో పెరుమాండ్లు (శత్రు), ఎమ్మెల్యే నరసప్ప (అశుతోష్‌ రాణా) చాలా అరాచకాలు చేస్తుంటారు. వాళ్ళని చూస్తేనే జనానికి భయం. అయితే నరసప్ప తమ్ముడు శేఖర్‌ బాబు (సిద్దు జొన్నలగడ్డ) మాత్రం మంచోడు. అందరికీ సాయం చేస్తూ మంచివాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే, శేఖర్‌బాబుని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఊళ్ళో చెట్టుకి వేలాడదీసి మరీ కాల్చేస్తారు. ఈ ఘోరమైన హత్య వెనుక ఎవరున్నారనే విషయమై నిజాల్ని నిగ్గు తేల్చడానికి ఐపీఎస్‌ అధికారి కల్కి (రాజశేఖర్‌) పూనుకుంటాడు. ఇంతకీ, శేఖర్‌బాబుని ఎవరు చంపారు.? అరి వీర భయంకరుడైన ఎమ్మెల్యే నరసప్ప తమ్ముడ్ని చంపేంత ధైర్యం ఎవరు చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే..
రాజశేఖర్‌కి పోలీస్‌ అధికారి పాత్రలంటే కొట్టిన పిండి. చాలా అలవోకగా చేసుకుంటూ పోతారాయన. ఈ సినిమాలో మరోమారు పాత్రకు ప్రాణం పోసే ప్రయత్నమైతే చేశారుగానీ, ఎందుకో ఇదివరకటి జోష్‌, ఈజ్‌ తగ్గినట్లనిపిస్తుంది. అయితే, తన పాత్ర వరకూ ఆయన పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. రాహుల్‌ రామకృష్ణ, హీరోకి సాయపడే పాత్రలో కనిపిస్తాడు. అతని పాత్రకి మంచి మార్కులు పడతాయి.
హీరోయిన్లలో ఆదా శర్మ అందంగా కనిపించింది. నందిత శ్వేతకి మంచి పాత్ర దొరికింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అశుతోష్‌ రాణా తనదైన స్టయిల్లో విలనిజంని పండించారు. శత్రు కూడా అంతే. సిద్దు జొన్నలగడ్డ బాగా చేశాడు. చరణ్‌ దీప్‌, నాజర్‌, పూజిత పొన్నాడ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. మిగతా పాత్రధారులంతా ఓకే.
అనుక్షణం ఉత్కంఠ రేపే సత్తా వున్న కథని ఎంచుకున్న దర్శకుడు కథనం విషయంలో కొంత తడబడినట్లు అనిపిస్తుంది. డైలాగ్స్‌ బాగానే వున్నాయి. సంగీతం ఓకే. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సోసోగా వుంటే, మరికొన్ని చోట్ల మాత్రం చాలా బావుంది. సినిమాటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడతాయి. ఎడిటింగ్‌ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. సినిమా నిడివి తగ్గి వుంటే, రిజల్ట్‌ ఇంకా బాగా వచ్చి వుండేదేమో. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌. దీన్ని డీల్‌ చేసే క్రమంలో స్టయిలిష్‌ మేకింగ్‌ని చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. అయితే, కథాగమనంలో చాలా స్పీడ్‌ బ్రేకర్లు తగిలాయి. వున్నపళంగా కథ ఎక్కడికో వెళ్లిపోయినట్లు అన్పిస్తుంది. అంతలోనే, మళ్ళీ కథ ట్రాక్‌ ఎక్కేస్తుంటుంది. రాజశేఖర్‌ని పవర్‌ఫుల్‌గా చూపించే క్రమంలో కథలో సీరియస్‌నెస్‌ని పక్కన పడేసినట్లు అన్పిస్తుంటుంది. కథలోకి అనవసరంగా లవ్‌ ట్రాక్‌ వచ్చేయడం పెద్ద మైనస్‌. ఫస్టాఫ్‌ అంతా సోసోగా సాగిపోతే, సెకెండాఫ్‌లో అసలు కథ స్టార్ట్‌ అయినట్లనిపిస్తుంది. చివరి పది నిమిషాల్లో మళ్ళీ ఊపు వస్తుంది. కానీ, అప్పటికే నీరసం ఆవహించేస్తుంది ప్రేక్షకుడికి. ఓవరాల్‌గా ఇది జస్ట్‌ యావరేజ్‌ థ్రిల్లర్‌ అనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతుంటే మజా ఏం వుంటుంది.?
అంకెల్లో చెప్పాలంటే..
2.5/5
ఒక్క మాటలో చెప్పాలంటే..
కల్కి... థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ తక్కువ, సాగతీత ఎక్కువ.
 

మరిన్ని సినిమా కబుర్లు
Yagnam is over.!