రొమాంటిక్ లవ్‌లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'బుర్రకథ'కు సెన్సార్ కష్టమొచ్చిందే. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సెన్సార్ వద్ద కష్టపడేంత సీను ఏముందో అర్ధం కాని ప్రశ్నగా మిగిలింది. అన్నీ కుదిరితే, ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, సెన్సార్ వద్ద విఘ్నం ఏర్పడడంతో అక్కడే ఆగిపోయింది. రిలీజ్ డేట్ వాయిదా పడిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అసలే చిన్న సినిమాలకు రిలీజ్ స్లాట్స్ బుక్ కావడం చాలా కష్టమైపోతున్న రోజులివి. ఏం చేస్తాం. చెప్పండి. మా చిన్న సినిమా వాళ్ల కష్టాలు మీకేం తెలుస్తాయిలెండీ.
అయితే, అసలు మ్యాటరేంటంటే, 'బుర్రకథ'ను ఆపడానికి సెన్సార్ వారికి వచ్చిన మొహమాటాలేంటో అర్ధం కాని ప్రశ్నే మళ్లీ. ఈ మధ్య అడల్ట్ కంటెంట్ మూవీస్.. అదేనండీ బూతు కంటెంట్ అనేసుకోండి తప్పేం లేదు.. వాటికే సెన్సార్ వాళ్లు ఈజీగా సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. అలాంటిది పాపం ఈ 'బుర్రకథ' ఏం చేసిందండీ.. యూత్‌ని పెడదోవ పట్టించే జుగుప్సాకరమైన రొమాంటిక్ సన్నివేశాలున్నాయా.? పిల్లల్ని భయపెట్టే హారర్ అంశాలున్నాయా.? ప్రెగ్నెంట్ లేడీస్ భయపడే హింసాత్మక సన్నివేశాలున్నాయా.? ఏమున్నాయి అధ్యక్షా.. 'బుర్రకథ'లో. అసలెందుకీ కక్ష్య. ఎందుకీ అణిచివేత. చిన్న సినిమాల్ని ఇక్కడే అణిచేస్తారా.? అఫ్‌కోర్స్ ఇంతకంటే చిన్న సినిమాలే సెన్సార్ గడపలు దాటేసి, దర్జాగా బయటికొచ్చేశాయనుకోండి. మరి 'బుర్రకథ' దగ్గరికి వచ్చేసరికే ఎందుకీ వివక్ష.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేదెలా.? పాపం 'బుర్రకథ'కు రిలీజ్ డేట్ చిక్కేదెలా.? ఏమో ఏమవునో.. వేచి చూడాలే.
|