Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

గ్యాంగ్‌'తో పాటు ఎంట్రీ ఇచ్చిన 'గ్యాంగ్‌లీడర్‌'.!

Gangleader  made entry with Gang

విక్రమ్‌ కుమార్‌ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీస్‌ కన్నా, అరుదైన విలక్షణ సబ్జెక్ట్‌లను తెరకెక్కించడంలో ఆయన రూటే సెపరేటు. అఫ్‌కోర్స్‌..! విలక్షణం చూపించినా, కమర్షియాలిటీని కూడా మిస్‌ అవడనుకోండి. అలా విభిన్న కథాంశంతో, కమర్షియల్‌ టచ్‌తో వస్తున్న చిత్రం 'గ్యాంగ్‌లీడర్‌'. నేచురల్‌ స్టార్‌ నానితో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు విక్రమ్‌ కుమార్‌. అయితే, 'గ్యాంగ్‌లీడర్‌' అనే టైటిల్‌ని విక్రమ్‌ ఎందుకు వాడుకున్నాడు.? అనే ప్రశ్నకి ఈ మధ్యనే సమాధానమిచ్చేశాడు. డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూప్స్‌ ఉన్న ఐదుగురు ఆడవాళ్లకు నాని గ్యాంగ్‌లీడర్‌ అన్నమాట. తొమ్మిదేళ్ల పాప నుండి 70 ఏళ్ల బామ్మ వరకూ ఉన్న ఐదుగురు లేడీస్‌కి నాని గ్యాంగ్‌లీడర్‌. ఇదంతా బాగానే ఉంది.

అయితే, ఈ గ్యాంగ్‌ కోసం మనోడు ఏం చేశాడు.? అనేది తెలియాలంటే ఇంకొంచెం సమయం వేచి చూడాలి. ప్రస్తుతానికయితే, 'రివేంజర్స్‌ అసెంబుల్డ్‌' ఈ ఐదుగురు గ్యాంగ్‌తో గ్యాంగ్‌లీడర్‌ అదే మన నాని కలిసి ఉన్న ఫస్ట్‌లుక్‌ అయితే రిలీజ్‌ చేశారు. ఈ నెల 24న టీజర్‌ రానుంది. అది వచ్చినాక ఈ సినిమా కథా, కమామిషు ఏంటనే క్లారిటీ వచ్చేస్తుందిలెండి. ఆ కథా, కాకరకాయ్‌ తెలిసినాక సినిమా రిలీజ్‌ కూడా ఇంకెంతో దూరం లేదులెండి. దాదాపు షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చేసిందట. ఆగస్ట్‌ 30న 'గ్యాంగ్‌లీడర్‌' గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేస్తాడు. ప్రియాంకా మోహనన్‌ ఈ సినిమాలో నానికి జతగా నటిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
Saho  for fans.