Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Saho  for fans.

ఈ సంచికలో >> సినిమా >>

మన రామాయణం ఎంత 'ఘనం'.!

our Ramayana is great

ఇద్దరు విలక్షణ దర్శకులు, ముగ్గురు అభిరుచి గల నిర్మాతలు.. చాలా రేర్‌ కాంబినేషన్‌ ఇది. ఈ కాంబినేషన్‌లో వెండితెర అద్భుతానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే రామాయణం. రామాయణం అంటే ఓ దృశ్య కావ్యం. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుత కావ్యం. అలాంటి రామాయణాన్ని రెండున్నర గంటల సినిమాగా తీయడమంటే సాధ్యం కాని విషయమే నేటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని. కానీ ఈ సాహసం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఒక బాలీవుడ్‌ నిర్మాత, టాలీవుడ్‌లోని ఇద్దరు ప్రముఖ నిర్మాతలతో కలిసి ఈ అద్భుత ఘట్టాన్ని పట్టాలెక్కించనున్నారు. ప్యాన్‌ ఇండియన్‌ మూవీగా ఈ సినిమాని రూపొందించబోతున్నారు. 1500 భారీ బడ్జెట్‌ చిత్రంగా, మూడు పార్ట్‌లుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు.

ఇదంతా బాగానే ఉంది. కానీ, ఈ మోడ్రన్‌ రామాయణంలోని పాత్రధారులెవరు.? ఈ జనరేషన్‌ హీరోల్ని ఎంచుకుంటారా.? లేక సీనియర్‌ స్టార్స్‌ని ఎంచుకుంటారా.? అంటే ఓ వైపు అన్ని భాషల నుండీ స్టార్‌ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారట అనే గాసిప్‌ పుట్టుకొచ్చింది. మరోవైపు మెగా కాంపౌండ్‌ హీరోల్లో చరణ్‌ని ముఖ్య పాత్రధారుడిగా అంటే రాముడిగా తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్‌ ఆల్రెడీ చరణ్‌ వద్ద ఈ ప్రతిపాదన తీసుకొచ్చారనీ, చరణ్‌ ఆ ప్రతిపాదనను కాదన్నాడంటూ ఓ కొత్త గాసిప్‌ తాజాగా చక్కర్లు కొడుతోంది. ఈ జనరేషన్‌కి సంబంధించి, రాముడిగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని మించిన నటుడు ఇంకెవరుంటారంటూ ఆయన ఫ్యాన్స్‌ వాదిస్తున్నారు. కథ పరంగా సినిమాకి గ్రాఫిక్స్‌ యూజ్‌ చేస్తారా.? లేక కథని కథలాగే నేచురల్‌గా తెరకెక్కిస్తారా.? వంటి ప్రశ్నలు ఇంకోవైపు. ఇలా ఈ ప్రాజెక్ట్‌ని వెంటాడుతున్నాయి. దర్శకులు, నిర్మాతల లిస్ట్‌ మాత్రమే ఫైనల్‌ అయ్యింది. నటీనటుల విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. అంతవరకూ వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా కబుర్లు
Regulars,but give a kick!