బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 ఈ నెల 21 నుండి అనగా ఆదివారం నుండీ ప్రసారం కానుంది.నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ప్రోమోస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ షోని టీవీలో ప్రసారం చేయొద్దంటూ ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశారు. సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చేలా ఈ షోలోని సన్నివేశాలుంటున్నాయనీ, సెలబ్రిటీస్ బిహేవియర్ హద్దులు దాటేస్తోందనీ ఆరోపిస్తూ సదరు వ్యక్తి కేసు వేశారు. అంతేకాదు, వల్గారిటీని ప్రోత్సహిస్తూ, డబుల్ మీనింగ్ డైలాగులతో షోని నిర్వహిస్తున్నారు కనుక సినిమాలకున్నట్లే ఈ షోలోని ప్రతీ ఎపిసోడ్‌కీ సెన్సార్ ఉండాలనీ సదరు వ్యక్తి తన పిటీషన్‌లో పేర్కొన్నారు అలాగే, అవసరమైతే ఈ షోని 11 గంటల తర్వాతే టీవీలో ప్రసారం చేయాలంటూ ఆ పిటీషన్‌లో ఉంది. ఇవే కాదు, కేసుల మీద కేసులు బిగ్‌బాస్‌ని చుట్టుముడుతూనే ఉన్నాయి.
అలా ఈ షో ప్రసారానికి ముందే హాట్ టాపిక్ అయ్యింది. చివరికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునపై సోషల్ మీడియా వేదికగా అప్పుడే వ్యతిరేకత ఏర్పడింది. ఆయన ఫ్యాన్స్ కొందరు 'నువ్వు ఈ షోకి హోస్ట్‌గా ఉండొద్దు.. బాస్' అంటూ సూచనలు, సలహాలు ఇచ్చేస్తున్నారట. అయితే, బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం లీగల్‌గా ఈ కేసులన్నీ ఓ గాడిన పడేసేందుకు ట్రై చేస్తున్నారట. తమ షోని అడ్డుకోవద్దంటూ బిగ్‌బాస్ టీమ్ తాజాగా హైకోర్టులో పిటీషన్ వేసింది. మరి, హైకోర్ట్ నుండి బిగ్‌బాస్‌కి పోజిటివ్‌గా రెస్పాన్స్ వస్తుందా.? అనుకున్న తేదీకే బిగ్‌బాస్ 3 టీవీలో ప్రసారమవుతుందా.? వేచి చూడాల్సిందే.
|