ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా 'సాహో' విడుదల కాబోతోందంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విడుదల తేదీ దగ్గర పడ్డాక 'సాహో' టీమ్ షాకిచ్చింది. సినిమా విడుదలను పోస్ట్‌పోన్ చేస్తున్నామని ప్రకటించింది. కారణాలు అనేకం కానీ, ఈ విషయం ఫ్యాన్స్‌ని బాగా నిరాశపరిచింది. అయితే, ఏ వారం రోజులో, పది రోజులో ఉండగా పోస్ట్‌పోన్ అయితే ఆ ఇంపాక్ట్ ఇంకా తీవ్రంగా ఉండేది. నెల రోజుల వ్యవధిలో ఉండగానే రిలీజ్ పోస్ట్‌పోన్డ్ విషయాన్ని అనౌన్స్ చేసి చిత్ర యూనిట్ మంచి పని చేసింది. అసలింతకీ 'సాహో' ఎందుకు పోస్ట్‌పోన్ అయ్యింది.? ఆ వివరాల్లోకి వెళితే, 'సాహో' భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆ బడ్జెట్ వేల్యూ అంతా తెరపై కనిపించాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది.
అందుకే ప్రొడక్ట్‌లో ఆ క్వాలిటీని తెచ్చేందుకే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందట. ఏమాత్రం తొందర పడకూడదనీ, లేట్ అయినా, లేటెస్ట్‌గా అంచనాల్ని అందుకోవాలనీ భావిస్తోందట. అందుకే ముందు జాగ్రత్తగా 'సాహో' రిలీజ్‌ని వాయిదా వేసేశారు. ఇదిలా ఉంటే, 'సాహో' రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో, యంగ్ హీరోస్ శర్వానంద్, అడవిశేష్ తమ తమ సినిమాల డేట్స్‌ని ఆ డేట్‌లో ఫిక్స్ చేసుకుని మురిసిపోతున్నారు. భలే ప్లాట్‌ఫామ్ దొరికిందిలే అనుకుని సంబరపడిపోతున్నారు. శర్వానంద్ నటిస్తున్న 'రణరంగం' సెప్టెంబర్‌లో విడుదల కావల్సింది.. ఆగస్ట్ 15కి వచ్చేసింది. అలాగే అడవిశేష్ నటిస్తున్న 'ఎవరు' సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా ఇదే స్లాట్‌లో ఫిక్స్ అయ్యింది. అలా ఈ ఇద్దరు హీరోలు అనూహ్యంగా వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, 'సాహో' రిలీజ్ డేట్‌ని తమ సొంతం చేసుకున్నారు.
|