'ఆర్ ఎక్స్' హీరో కార్తికేయ ఫుల్ మాస్, అండ్ జోష్‌తో ముచ్చటగా మూడో సినిమాతో సిద్ధంగా ఉన్నాడండోయ్. అదే 'గుణ 369'. టైటిల్‌తోనే మనోడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. అయితే, ఇదే ఇంట్రెస్ట్ సినిమాలో కొనసాగిస్తాడా.? లేదా.? తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ సంగతి పక్కన పెడితే, అసలు మనోడు సినిమాలో ఏం చేశాడు.? ఎలా చేశాడు.? మనోడి కటౌట్ సంగతేంటీ.? కంటెంట్ సంగతేంటీ.? అని సింపుల్‌గా ఓ మాట అనేసుకుందాం. ఫస్ట్ టైటిల్‌లో నెంబరుంది చూశారూ.. ఆ నెంబర్ మ్యాటరేంటంటే, ఖైదీ నెంబర్ 150 లా 'గుణ 369' అనేది ఖైదీ నెంబర్ అన్నమాట. అంటే మనోడు ఖైదీనా అని అప్పుడే అడిగేయకండి. ట్రైలర్‌లో అలా కూడా కనిపించాడు మరి. ఇకపోతే, రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కార్తికేయ కనిపిస్తున్నాడీ సినిమాలో. స్టైలిష్ అండ్ క్లాస్ లుక్స్‌తో ఓ మారు, మాస్ లుక్స్‌లో ఇంకో మారు కనిపించాడు. మాస్ లుక్స్‌లో మనోడు ఇరగదీసేసిన యాక్షన్ ఉంది చూశారూ..
అబ్బబ్బబ్బా.. ఓ రేంజ్‌లో ఉందంతే. కటౌట్ అలాంటిది కదా. ఇకపోతే, లవర్ బోయ్ ఇమేజ్ తొలి సినిమాతోనే దక్కించుకున్నాడు. సో ఆ ఇమేజ్‌కి డ్యామేజీ కాకూడదు కదా.. హీరోయిన్నూ, లవ్వూ, లిప్‌లాకూ.. ఇవన్నీ దిట్టంగానే కుమ్మినట్లుంది. ఇక కంటెంట్ విషయానికొస్తే, 'మన వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే, ప్రపంచంలో ఏ ప్రమాదం ఏ మూల నుండి ఎప్పుడొస్తుందో.. ముందే తెలిసిపోవాలి..' అనుకుంటాడు. అంటే, తన అనుకున్న వాళ్లను కాపాడుకోవడం కోసం మనోడు ఏం చేశాడన్నదే సినిమా. ఇంతవరకూ మనం చెప్పుకున్నది జస్ట్ ట్రైలర్ రివ్యూ అంతేనండోయ్. ఫుల్ సినిమా చూడాలంటే ఆగస్ట్ 2 వరకూ ఆగాల్సిందే. అర్జున్ జంథ్యాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొత్తమ్మాయ్ అనఘ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.
|