Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

సైరా' జోష్‌ మొదలవుతున్నట్లేనా.?

Saira 'Josh

ఆగస్ట్‌ వచ్చిందంటే ఆ నెల అంతా మెగాభిమానులకు పండగే. జూలై 31తో 'మగధీర' సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంది. పదేళ్లుగా ప్రతీ ఏడాదీ సంబరాలు చేసుకుంటేనే ఉన్నారు. ఆ సినిమా సాధించిన విజయం అలాంటిది. మగధీర విడుదల తేదీ అయిన జూలై 31తో మొదలు పెట్టి, సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజుతో సంబరాల్ని ముగిస్తుంటారు మెగా అభిమానులు. ఈ ఏడాది ఆ మెగా సంబరాలకు 'సైరా' సందడి తోడవనుంది. ఆగస్ట్‌ 15న 'సైరా'కి సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ రాబోతున్నాయట. పోస్టర్‌ రిలీజ్‌ చేస్తారా.? ప్రీ టీజర్‌ ఏమైనా వదులుతారా.? అన్న చర్చ జరుగుతోంది. మరోపక్క ఆగస్ట్‌ 22 అసలు సిసలు జాతర అని మెగా ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. అయితే, 'సైరా'కి సంబంధించి, చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ ఆచితూచి అడుగులేస్తున్నాడు.

ప్రస్తుతానికి 'సైరా' గురించి ఎలాంటి అధికారిక సమాచారం బయటికి పొక్కలేదు. అక్టోబర్‌ 2న సినిమా విడుదల ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దానికి అనుగుణంగానే తెర వెనుక పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా స్పీడుగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, చిరంజీవి తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 'సైరా' గెటప్‌ నుండి బయటికొచ్చేసి, చిరంజీవి స్లిమ్‌లుక్‌తో కనిపిస్తున్నారిప్పుడు.

మరిన్ని సినిమా కబుర్లు
Tamanna in the Big House