తొలిసారిగా బిగ్‌బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రికి అవకాశమిచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తమన్నా బిగ్‌హౌస్‌లోకి వెళ్లింది. తమన్నా కోసమే హేమపై వేటు వేశారా.? లేదంటే, ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే తమన్నా ఎంట్రీ జరిగిందా.? వంటి ప్రశ్నలకు సోషల్ మీడియా ప్రశ్నలకు రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, హౌస్‌లోకి తమన్నా ఎంటర్ అయ్యాక మొత్తం ఫోకస్ ఆమె మీదకే వెళ్లిపోయింది. తమన్నా లేని ఫ్రేమ్ కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. డ్రస్సింగ్ విషయంలో శ్రీముఖి, పునర్నవి, అషూలకు ధీటుగా తమన్నా దర్శనమిస్తోంది.
అయితే, ఇలా తమన్నాని చూపించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్టే కనిపిస్తోంది. ట్రాన్స్‌జెండర్ అయినా, ఆమెని హౌస్‌లో ఎవరూ వేరే భావంతో చూడడం లేదు. మరోపక్క కొందరిని టార్గెట్ చేసుకున్నట్లు తమన్నా బిహేవియర్ కనిపిస్తోంది. మిగతా హౌస్‌మేట్స్ ఒకరితో ఒకరు ఎలా గొడవ పెట్టుకున్నా పర్లేదు కానీ, తమన్నాతో క్లాష్ వచ్చిందంటే అంతే సంగతి. షో మొత్తం రోడ్డున పడిపోతుంది. ఇది తెలిసి బిగ్‌బాస్ నిర్వాహకులు రిస్క్ చేశారంటే, వ్యవహారం చాలా ప్లాన్డ్‌గానే ఉండి ఉండాలి. ఇదిలా ఉంటే, ఫస్ట్ వీకెండ్‌ని నాగార్జున బాగానే డీల్ చేసినా, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్థాయిలో ఎంటర్‌టైన్ చేయలేకపోయాడు.
|