Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
health gossips about rana

ఈ సంచికలో >> సినిమా >>

భయపెడుతున్న 'సాహో'

saho

'బాహుబలి'తర్వాత ప్రబాస్‌ హీరోగా రూపొందుతోన్న సినిమా 'సాహో'. సుజిత్‌ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. 'బాహుబలి'తో పోలిక ఉంటుంది కనుక, ఆ స్థాయిలో ఉండాలనే లక్ష్యం పెట్టుకుని అత్యంత భారీ స్థాయిలో సినిమాని రూపొందించారు. విడుదలకు ముందు, అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఇంకో నెల రోజుల్లో సినిమా విడుదలవుతుంది. ఈ లోగా, ఆ అంచనాలు ఇంకా ఇంకా పెరగబోతున్నాయి కూడా.

కానీ, అదే సమస్యగా మారుతోందని కొందరు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 'బాహుబలి' వేరు, ఆ సినిమా మార్కెటింగ్‌ వేరు. రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు, తన సినిమాని ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తెలిసిన సినీ పండితుడు. కానీ, 'సాహో' విషయంలో పరిస్థితులు అలా కనిపించడం లేదు. హైప్‌ ఉంది. సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా ఉంది. అయితే ఇక్కడితో సరిపోదు. ఇంకా చాలా చాలా చేయాల్సి ఉంటుంది ప్రమోషన్స్‌ పరంగా. ఇంకా నెలరోజులు ఉంది కాబట్టి, ఈ నెల రోజుల్లో చాలా అద్భుతాలు జరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. జరిగితే మంచిదే. సగటు తెలుగు ప్రేక్షకుడు అదే ఆశిస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.! 
 

మరిన్ని సినిమా కబుర్లు
Is Hindi comrade or not