Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రాక్షసుడు చిత్రసమీక్ష

rakshasudu movie review
చిత్రం: రాక్షసుడు 
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌, రాజీవ్‌ కనకాల 
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ దిలీప్‌ చుండురు 
సంగీతం: గిబ్రాన్‌ 
నిర్మాత: సత్యనారాయణ కోనేరు 
దర్శకత్వం: రమేష్‌ వర్మ 
విడుదల తేదీ: 2 ఆగస్ట్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

తండ్రి ద్వారా పోలీస్‌ ఉద్యోగం దొరుకుతుంది అరుణ్‌ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌)కి. మరోపక్క టీనేజ్‌ గర్ల్స్‌ వరుసగా కిడ్నాప్‌ అవుతుంటారు. ఆ కేసుని ఛేదించే బాధ్యత అరుణ్‌ అండ్‌ టీమ్‌ దక్కించుకుంటుంది. ఇంతకీ, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నదెవరు.? ఆ కిడ్నాప్‌ మిస్టరీని అరుణ్‌ ఛేదించాడా? లేదా? ఈ క్రమంలో అరుణ్‌కి ఎదురైన సమస్యలేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే..

కమర్షియల్‌ ఆలోచనలు చేయకుండా భిన్నమైన పాత్రని ఎంచుకున్నందుకు ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని అభినందించాలి. డీసెంట్‌ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా మంచి నటనతో ఆకట్టుకుంటాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అలరించాడు. మెచ్యూర్డ్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌ని ఈ సినిమాలో  చూస్తాం. పాత్రకు ఎంత అవసరమో అంత మేర తన స్కిల్స్‌ని వాడాడు. మంచి పెర్ఫామర్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌  అనుపమ పరమేశ్వరన్‌కి డీసెంట్‌ రోల్‌ దక్కింది. తన పాత్రలో ఒదిగిపోయిందామె. రాజీవ్‌ కనకాల మరోమారు తన అనుభవాన్ని రంగించాడు. అతని పాత్రకి మంచి మార్కులు దక్కుతాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.  థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌ని ఇంకా థ్రిల్లింగ్‌గా చెప్పే క్రమంలో దర్శకుడు కొంతమేర సక్సెస్‌ అయ్యాడు. కథ, కథనం బావున్నాయి. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ తమవంతు సహకారాన్ని అందించాయి.  నిర్మాణపు విలువలు చాలా చాలా బావున్నాయి. ఎక్కడా రాజీ పడని వైనం సినిమా అంతటా కన్పిస్తుంది.

ఇలాంటి థ్రిల్లర్‌ సినిమాల్ని దర్శకుడు ఎంత గ్రిప్పింగ్‌గా మలిచితే, అంత మంచి విజయం దక్కుతుంది. ఈ విషయంలో దర్శకుడు అనవసరపు రిస్క్‌లు తీసుకోలేదు. తమిళ సినిమాని దాదాపుగా ఫాలో అయిపోయాడు. అయితే, క్లయిమాక్స్‌కి ముందు వచ్చే సన్నివేశాలు కొంత సాగతీతగా అన్పిస్తాయి. ఓవరాల్‌గా థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కమర్షియల్‌ ఆలోచనలతో సినిమాకి వెళితే నిరాశ తప్పదు. నటీనటుల పెర్ఫామెన్స్‌, సాంకేతిక వర్గం పనితీరు, థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌.. ఇవన్నీ పర్టిక్యులర్‌గా ఓ సెక్షన్‌ ఆడియన్స్‌కి నచ్చుతాయి. కమర్షియల్‌ గోదారిలో కాకుండా కొత్త ఆలోచనతో ముందడుగు వేసినందుకు టీమ్‌ని అభినందించాల్సిందే. ఓవరాల్‌గా ఓ మంచి థ్రిల్లర్‌ సినిమాని చూశామనే అనుభూతి అయితే సినిమా చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది.

అంకెల్లో చెప్పాలంటే..
3/5

ఒక్క మాటలో చెప్పాలంటే..
రాక్షసుడు బాగానే వున్నాడు..
మరిన్ని సినిమా కబుర్లు
churaka