సినీ జనాల మీద గాసిప్స్ మామూలే. అఫైర్ల గురించి గాసిప్స్ పుడితే అదో లెక్క. కానీ, హెల్త్ ఇష్యూస్ మీద గాసిప్స్ క్షమార్హం కాదు. ఈ మధ్య కాలంలో హెల్త్‌కి సంబంధించి నెగిటివ్ గాసిప్స్ రానా మీద వచ్చినంతగా ఇంకెవ్వరి మీదా రాలేదు. రానా ఎంత హెల్త్ కాన్షియస్సో అందరికీ తెలుసు. ఆరడుగుల పైన పొడవుతో, ఆజానుబాహుడిలా కనిపించడమే కాదు, ఒక బీస్ట్ తరహాలో స్క్రీన్ మీద పర్‌ఫామ్ చేస్తాడు.
హెల్త్‌ని ఎంత కంట్రోల్‌లో పెట్టుకుంటే, అంత ధృఢంగా కనిపిస్తాడు.? ఈ చిన్న లాజిక్ వదిలేసి రానాకి ఏకంగా కిడ్నీలే చెడిపోయాయనీ, కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిపోయిందని కథలు అల్లేశారు. 'నేను బాగానే ఉన్నాను మొర్రో..' అంటూ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చుకోవల్సిన పరిస్థితి రానాకి ఎదురైంది. ప్రస్తుతం రానా విదేశాల్లో ఉన్నాడు. అదీ సినిమా పనుల కోసమే. ఓ సాంకేతిక అద్భుతాన్ని ఇండియన్ సినిమాకి అందించే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు రానా.
|