'డియర్ కామ్రేడ్' అంచనాల్ని తలకిందులు చేసింది. 100 కోట్లు కొల్లగొట్టే దమ్ము సినిమాలో ఉందంటూ, అంచనాలు ఆ దిశగానే పెరిగినా, 'డియర్ కామ్రేడ్' తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆశలు ఆడియాశలైపోయాయి. సక్సెస్, ఫెయిల్యూర్ మామూలే అయినా, విజయ్ దేవరకొండ పరిస్థితి వేరు. అప్పుడు 'నోటా' ఇప్పుడు 'డియర్ కామ్రేడ్'. విజయ్ కెరీర్‌కి స్సీడు బ్రేకర్లుగా మారాయి. సినిమా హిట్టయ్యి ఉండుంటే, ఇప్పుడు చర్చ మరోలా ఉండేది. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లో ఈ సినిమాని రీమేక్ చేద్దామనుకున్న కరణ్‌జోహార్ సైలెంట్ అయిపోయాడు.
ఆరున్నర కోట్లకు రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడంటూ తెలుగు నాట ప్రచారం కొనసాగుతున్నా, కరణ్ జోహార్ రీమేక్ గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. విడుదలకు ముందు సినిమా చూసి, అభినందించి, రీమేక్ చేస్తానని ప్రకటించిన కరణ్ జోహార్, ప్రస్తుతానికి ఆ ఆలోచనను పూర్తిగా విరమించుకున్నట్లు తెలిసింది. అయితే, చిన్న చిన్న మార్పులతో కరణ్ ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తాడనీ కొన్ని ఊహాగానాలు మాత్రం ప్రచారంలోనే ఉన్నాయి.
|