Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

శృతిహాసన్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు.!

srutihasan  act in diskoraja movie

అందాల భామ శృతిహాసన్‌ ఈ మధ్యనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న 'లాభం' సినిమాలో శృతిహాసన్‌ నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం ఓ పాట కోసం డేరింగ్‌ స్టంట్స్‌ చేసిందట. దాంతో శృతిహాసన్‌ని వండర్‌ విమెన్‌గా అభివర్ణించేస్తున్నారు. సినిమాలో శృతి పాత్రకు కూడా అత్యంత కీలకంగా ఉండబోతోందట. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత శృతి నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

అందులోనూ విజయ్‌ సేతుపతి సినిమా కావడం సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, శృతిహాసన్‌ తెలుగులోనూ ఛాన్స్‌ దక్కించుకుంది. మాస్‌ రాజా రవితేజ కొత్త చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. గోపీచంద్‌ మలినేని ఈ సినిమాకి దర్శకుడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్‌ 'బలుపు' చిత్రంలో నటించింది గతంలో. ఆ సినిమాలోనూ రవితేజనే హీరో. సో గోపీచంద్‌, రవితేజ కాంబోలో రెండోసారి శృతిహాసన్‌ నటిస్తున్నట్లన్న మాట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమాతో బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
pawan kalyan re entry