'అత్తారింటికి దారేది' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి ఆ తర్వాత 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత..' చిత్రాల వరుస ఫెయిల్యూర్స్ బాధించాయి. దాంతో త్రివిక్రమ్ పని అయిపోయిందనుకున్నారంతా. కానీ, అల్లు అర్జున్‌తో ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'అల వైకుంఠపురములో..' అంచనాలు రేకెత్తిస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. అంతే కాదు, త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడట. 'అత్తారింటికి దారేది' టైప్ సూపర్ హిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడట. ఆ నేపథ్యంలోనే సంక్రాంతికి విడుదల కాబోయే ఈ సినిమాని ఇప్పటి నుండే భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్ టీజర్‌ని ఆసక్తికరంగా రిలీజ్ చేశారు.
ఇక ఇప్పుడు పాటలు విడుదల చేస్తున్న విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. తొలి పాటగా రిలీజ్ అయిన 'సామజవరగమన..' పాట రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇక రెండో పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియో సింగిల్‌ని చిత్ర యూనిట్ అందర్నీ కలిపి ఓ వీడియో రూపంలో విడుదల చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. 'రాములో రాములా..' అంటూ సాగే ఈ పాటతో 'అల వైకుంఠపురములో..' సినిమాకి ఎక్కడ లేని బజ్ వచ్చేసింది. ఓ సెలబ్రేషన్‌లా ఉందీ పాట ప్రోమో. దాంతో, సినిమాలో కూడా ఇదే జోష్ ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ అదిరిపోయే స్ట్రాటజీ ప్లాన్ చేశారంటూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో.
|