'ఇస్మార్ట్ శంకర్' సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న రామ్ పోతినేని తన కొత్త సినిమాని అనౌన్స్ చేయడం, స్టార్ట్ చేయడం, ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేయడం టక టకా జరిగిపోయాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ తాజా చిత్రం ఉండబోతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా సెట్స్ మీదికెళ్లింది. 'ఇస్మార్ట్ శంకర్'తో వచ్చిన క్రేజ్‌ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతోనే వెంటనే సినిమా స్టార్ట్ చేసేశాడు. అంతేకాదు, ఈ సినిమా టైటిల్‌తో పాటు, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేయడం విశేషం. 'రెడ్' అనే టైటిల్‌తో ఈ సినిమాని ఏప్రిల్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని రామ్ చెప్పేశాడు. అంతేకాదు, ఇంతవరకూ మాస్, అండ్ కూల్ ఎంటర్‌టైనర్స్‌కే ప్రాధాన్యత ఇచ్చిన రామ్ ఈ సారి థ్రిల్లర్ జోనర్‌ని ఎంచుకున్నాడు.
వాస్తవానికి ఇదో తమిళ రీమేక్. కానీ, రామ్ కోసం కిషోర్ తిరుమల ఒరిజినల్ కథలో కొన్ని కీలక మార్పులు చేశాడట. రామ్ లుక్ కూడా డిఫరెంట్ అండ్ రగ్గ్‌డ్ లుక్‌లా అనిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో రామ్ డబుల్ రోల్ పోషిస్తున్నాడు. ఒక పాత్ర కూల్‌గా, ఇంకో పాత్ర రఫ్ అండ్ టఫ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లకు చోటున్న ఈ సినిమాలో 'నేల టికెట్' బ్యూటీ మాళవికా శర్మ వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్ వివరాలు తెలియాల్సి ఉంది. 'ఇస్మార్ట్' మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మరోసారి ఈ సినిమా కోసం రామ్‌తో కలిసి వర్క్ చేస్తున్నాడు. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.
|