చాలా కాలం తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఓ భారీ చిత్రం ఆమె రీ ఎంట్రీకి వేదికయ్యింది. 'సరిలేరు నీకెవ్వరు..' లో విజయ శాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఆమె పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. భారతి అనే లెక్చరర్ పాత్ర పోషిస్తున్న విజయశాంతి లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా అప్పుడే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. ఆ క్రమంలో ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో విజయ శాంతి ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.
వన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది కదా.. అని వరుస పెట్టి సినిమాల్లో నటిస్తానని అనుకుంటారేమో. సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తా.. కథ బాగా నచ్చి, అందులో తన పాత్ర ఇంకా బాగా నచ్చితే కానీ, చేయనని తెగేసి చెబుతోంది లేడీ సూపర్ స్టార్. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్‌లుక్‌ని బట్టి, టాలీవుడ్ లేడీ అమితాబ్ అని ఆమెను అభివర్ణిస్తున్నారు. అయితే, తనకు సినిమాలు కాదు, రాజకీయాలే ముఖ్యమంటోంది విజయ శాంతి. అయితే, ఇప్పట్లో రాజకీయాల్లో ఏమంత చెప్పుకోదగ్గ సీను, సినిమా లేదు.. అని అర్ధమైపోయే రాజకీయాల నుండి బ్రేక్ తీసుకుని, సినిమాల్ని ఎంచుకున్నట్లు అర్ధమవుతోందంటూ, కొందరు భావిస్తున్నారు. మొత్తానికి విజయ శాంతి అంటే, ఆటిట్యూడ్. ఆటిట్యూడ్ అంటే విజయ శాంతి. అది చూపించే క్రమంలోనే ఆమె చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనమయ్యాయనుకోవాలి.
|