Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

పూజా చేతికి మరో మెగా ఛాన్స్‌.!

mega chance

మెగా కాంపౌండ్‌ హీరో వరుణ్‌ తేజ్‌తోనే తెలుగులో తన సినీ కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది అందాల భామ పూజా హెగ్దేకి. డెబ్యూ మూవీ 'ముకుందా'తో పూజా మంచి బోణీ కొట్టింది. లేటెస్ట్‌గా 'గద్దలకొండ గణేష్‌'తో మరోసారి ఇదే కాంబినేషన్‌లో మంచి హిట్‌ అందుకుంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో రెండుసార్లు జత కట్టింది. గతంలో 'డీజె'లో నటించిన పూజా, తాజాగా బన్నీతో 'అల వైకుంఠపురములో..' నటిస్తోంది. చరణ్‌తో 'జిగేల్‌ రాణి..' అంటూ మాస్‌ స్టెప్పులిరగదీసేసింది. ఇక ఇప్పుడు పూజాకి ఓ 'పవర్‌'ఫుల్‌ మెగా ఛాన్స్‌ అందిందని మాట్లాడుకుంటున్నారంతా. అదే తెలుగు 'పింక్‌' రీమేక్‌. ఈ సినిమాని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

ఈ సినిమాతో పవన్‌ కళ్యాణ్‌ని సినిమాల్లోకి తీసుకు రావాలన్నది బోనీ కపూర్‌ కోరిక. హిందీలో తాప్సీ పోషించిన పాత్రలో పూజా కనిపించనుంది. వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అయితే, పవన్‌ కళ్యాణ్‌ నటనపై అంతగా ఆసక్తి చూపడం లేదు ప్రస్తుత తరుణంలో. కానీ, బోనీ కపూర్‌ ఎలాగైనా పవన్‌ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ పవన్‌ నటించినా, మన జిగేల్‌ రాణికి పవన్‌తో రొమాన్స్‌ చేసే అదృష్టం అయితే ఉండదులెండి. ఎందుకంటే, పవన్‌ కళ్యాణ్‌ పాత్ర ఈ సినిమాలో కీలకమే కానీ, హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకునే పాత్ర కాదు. ఏది ఏమైతేనేం, పవన్‌ సినిమాలో కూడా తాను భాగం పంచుకుంటే, అదో శాటిస్‌ఫేక్షన్‌ పూజాకి. ఆ నెక్స్‌ట్‌ మెగాస్టార్‌కే పూజా గురి మరి.

మరిన్ని సినిమా కబుర్లు
big boss