ఇంత టఫ్‌గా యోగా ఫీట్స్ చేస్తున్న ఈ భామని చూశారా.? ఒకప్పుడు తెలుగులో స్టార్‌గా వెలుగొందిన హీరోయిన్ పిక్ ఇది. ఇప్పుడు తెలుగులో ఈ భామ హవా తగ్గింది. తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. హిందీలోనూ ఒకటీ అరా సినిమాలు చేస్తోంది. తెలుగులో హవా తగ్గినప్పటికీ ఓ యంగ్ హీరో సినిమాలో ఇటీవల ఛాన్స్ దక్కించుకుంది.
మొన్నీ మధ్యనే ఓ సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్‌గా నటించింది కూడా. యోగా, వర్కవుట్స్‌ని తన నిత్య కృత్యంగా మలచుకున్న ఈ భామ తన ఫిట్‌నెస్‌కి కారణం అవే అంటుంది. ఎంతటి డిఫికల్ట్ ఫీట్ అయినా ఇట్టే ట్రై చేస్తుంటుంది. ఆ క్రమంలోనే ఇదిగో ఈ ఫీట్ ట్రై చేసింది. కొంచెం కొత్తగా ఈ సారి వర్కవుట్స్‌లో మునిగిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో చెప్పుకోండి చూద్దాం.