ఎన్టీఆర్ మంచి నటుడు. నో డౌట్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ విషయం. రాజమౌళి మంచి దర్శకుడు ఇది కూడా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లో ప్రస్తుతం ఎన్టీఆర్‌పై కొన్ని ఇంపార్టెంట్ షాట్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ షాట్స్‌లో ఎన్టీఆర్ నట విశ్వరూపానికి జక్కన్నే షాక్ అవుతున్నాడని ఫిలిం వర్గాల టాక్. హీరో ఇంట్రడక్షన్స్‌ని షూట్ చేయడంలో రాజమౌళిది అందు వేసిన చేయి. అలాంటిది 'ఆర్‌ఆర్‌ఆర్' ఓ ప్రత్యేకమైన చిత్రం. ఇద్దరు స్టార్ హీరోల ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంది ఈ సినిమాలో. ఇక వారి ఇంట్రడక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ప్లాన్ చేసి ఉంటాడో కదా జక్కన్న. ప్రస్తుతం కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోందట.
గూస్ బంప్స్ వచ్చేలా ఈ సీన్ ఉంటుందట. తెరపై ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు పూనకమొచ్చినట్లు ఊగిపోతారట. ఈ సీన్‌లోనే ఎన్టీఆర్‌ని చూసిన దర్శకుడు జక్కన్న షాక్ అవుతున్నాడట. ఇంతకు ముందూ ఎన్టీఆర్‌తో రాజమౌళి రెండు చిత్రాలు తెరకెక్కించాడు. కానీ, వాటిన్నింట్లోకీ ఈ చిత్రం ప్రత్యేకమైనదిగా అభివర్ణిస్తున్నారు. ఇక అల్లూరి పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ పాత్రను మరింత పవర్ ఫుల్‌గా డిజైన్ చేశాడట. దాదాపు ఇద్దరి పాత్రలూ ఈక్వెల్‌గా ఉండనున్నాయి. అయితే, వీరిద్దరి పాత్రల్ని ఎక్కడ.? ఎలా.? కనెక్ట్ చేస్తాడో జక్కన్న అనే పాయింట్ ఆసక్తికరంగా మారింది. ఆ పాయింట్‌తోనే ఇటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, అటు చరణ్ అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెర పడాలంటే వచ్చే ఏడాది జూలై 30 వరకూ ఆగాల్సిందే.
|