నేచురల్ బ్యూటీ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జయలలిత జీవిత గాధ ఆధారంగా చాలా బయోపిక్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో కంగనా ప్రధాన పాత్రలో 'తలైవి' ఒకటి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఇంకోటి రూపొందుతున్నాయి. కానీ, వాటిన్నింట్లోకీ, నిత్యా మీనన్ లీడ్ రోల్ పోషిస్తున్న 'ది ఐరెన్ లేడీ' ప్రత్యేకమైనదిగా అభివర్ణిస్తున్నారు చిత్ర బృందం. ఈ బయోపిక్‌లో ప్రపంచానికి తెలియని చాలా ఆసక్తికరమైన అంశాల్ని టచ్ చేయనున్నారట. జయలలితకు సంబంధించి ఇన్‌సైడ్ ఇన్‌ఫామేషన్‌ని గేదర్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన టీమ్ చాలా కాలంగా కసరత్తులు చేస్తోందట.
అన్నింటికీ మించి నిత్యామీనన్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అమ్మ పాత్రలో నిత్య మేకోవర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో అచ్చు జయలలితను తలపిస్తోంది నిత్యామీనన్. ఈ పాత్రకు తనను ప్రేరేపించింది జయలలిత వ్యక్తిత్వమే అని చెబుతుంది నిత్యామీనన్. ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చి, రాజకీయాల్లో అంత స్ట్రాంగ్ లేడీగా ఎదిగిన గొప్ప లేడీ జీవిత గాధలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ ప్రయాణంలో జయలలితతో తనకు తెలియని ఎమోషనల్ బంధం ఏర్పడిందట. చాలా విషయాల్లో జయలలితకూ తనకూ పోలికలున్నాయంటోంది. మేనరిజమ్స్, టైమ్ పంక్చువాలిటీ, మాట తీరు, కొన్ని అలవాట్లు, బహు భాషా ప్రావీణ్యం.. ఇలా పలు రకాల అంశాల్లో జయలలితకూ, తనకూ పోలికలున్నాయని ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ చెప్పింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది.
|