బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ట్రోఫీని రాహుల్ సిప్లిగంజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, విన్నర్‌గా నిలిచిన రాహుల్ కన్నా, రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖికి ఎక్కువ మొత్తం ముట్టినట్లుగా తెలుస్తోంది. ప్రైజ్ మనీ 50 లక్షలు కాగా, అటూ ఇటూగా మొత్తం 80 లక్షల వరకూ రాహుల్ క్యాష్ చేసుకున్నాడట. అయితే, రన్నర్‌గా నిలిచిన శ్రీముఖి మాత్రం దాదాపు కోటికి పైగా క్యాష్ చేసుకుందని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. 105 రోజులు ప్యాకేజీకి రెమ్యురేషన్‌గా శ్రీముఖి ఇంత భారీ మొత్తాన్ని దక్కించుకుందంటూ సీక్రెట్ న్యూస్ వినబడుతోంది. ఓడిపోయినా తానే గెలిచినట్లుగా ఆటిట్యూడ్ ప్రదర్శించిన శ్రీముఖి, నిజంగానే విన్నర్ రాహుల్ కన్నా, భారీ మొత్తాన్ని దక్కించుకుందన్న మాట. ఇకపోతే, ట్రోఫీ అందుకుని బయటికొచ్చాక కూడా రాహుల్‌తో సమానంగా, రాహుల్‌కి మించిన గౌరవ సత్కారాలు అందుకుంది శ్రీముఖి. అభిమానులు, సన్నిహితులు శ్రీముఖికి సర్‌ప్రైజింగ్ వెల్‌కమ్ ప్లాన్ చేశారు.
మరోవైపు బిగ్‌బాస్ సీజన్ క్లోజింగ్ అనంతరం శ్రీముఖి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అవకాశం దొరికిన చోటల్లా రాహుల్‌ని చిన్నబుచ్చేందుకే శ్రీముఖి ట్రై చేసింది. ఏ కోశానా రాహుల్ విజయాన్ని శ్రీముఖి అంగీకరించలేదు. దాంతో సీజన్ ముగిశాక కూడా, బిగ్‌బాస్ వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. గత సీజన్స్‌లో లేని ప్రోసెస్ ఇది. సీజన్ ముగిసిపోగానే ఎవరెవరు ఎక్కడెక్కడో.. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ, ఈ సీజన్‌కి హీట్ ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇకపోతే, తదుపరి సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అప్పుడే తదుపరి సీజన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని సమాచారం.
|