యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
----- ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారోఅక్కడంతా ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ చిరంజీవి ఐన హనుమ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
రామ భక్తాగ్రేసరుడైన ఈ హనుమను "హనుమజ్జయంతి"నాడుస్మరించడం, పూజించడం, జీవితచరిత్ర , సుందరాకాండ, చాలీసా పఠించడం పుణ్యాన్నిస్తుంది. హనుమంతుడు మహా ఙ్ఞాని. అఖండ శ్రీరామ భక్తుడు.రోమరోమానా రామనామం వినిపిస్తుంటుందని అంటారు.నిరంతరం రామ నామ జపంతప్ప మరో ధ్యాసలేని మహా భక్తుడు.ఆయన తన హృదయం చింపి చూపగా అక్కడ సీతాసమేత శ్రీరాముడు దర్శనమిచ్చాడని అంటారు.అంటే దాని అర్ధం ఆయన హృదయం లో రాముని రూపం నిండి ఉందని.శ్వాస, ఆహారం, నీరు , జీవనం అంతా రాముడే ఆయనకు. హనుమ రామునికి సేవచేయనే జన్మించాడంటారు.
అసలు దశరధుడు పుత్రకామేష్టి చేయగా యఙ్ఞపురుషుడు ఇచ్చిన ప్రసాదం ,దశరధమహారాజు తన భార్యలు ముగ్గురికీ ఇచ్చాడు.అపుడువారిలో సుమిత్ర తన భాగాన్ని అంతః పురప్రాకారంపై ఉంచుకుని తలారబెట్టుకుంటుండగా ,తనకు ఉపయో గించే ఆహారంగా భ్రమించి ఒక గ్రద్ద తన్నుకు పోడం, దాన్ని అరణ్య ప్రాంతంలో వదిలేయగా , అక్కడ సంతానంకోసం శివార్చన చేస్తున్న అంజలి కి అది లభించి దాన్ని మహాప్రసాదంగా స్వీకరించగాఆమెకు హనుమ జన్మించాడని ఒకకధఉంది. దీనిప్రకారం తీసుకుంటే హనుమ సాక్షాత్ శ్రీరాముని సోదరుడవు తాడు.ఎలా చూసుకున్నా హనుమ తన జీవితం సర్వం శ్రీరామునికి అంకితం చేశాడని మనకు రామాయణ కధ వలన తెలుస్తున్నది.
హనుమ పుట్టినప్పటి నుండే తన అఖండ శక్తి సామర్ధ్యాలను చూపసాగాడు. పసిప్రాయంలోనే ఆయన ఒకరోజున ఆకలిగా ఉన్న సమయంలో అప్పుడే ఉదయిస్తున్నసూర్యుని ఫలంగా భావించి ఆకాశమార్గాన ఎగిరి వెళ్ళి సూర్యుని పుక్కిటపట్టగా, లోకం చీకటిమయ మవు తుంది. అప్పుడు ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధంతో కొట్టగా , బాల హనుమ మూర్ఛపోడం,శివాది దేవతలంతా వచ్చి హనుమను ఆశీర్వదించి వరాలివ్వగా,
హనుమంతునికి సూర్యుడు విద్యాబోధ చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణం లోను పండితుడయ్యాడు.నవ వ్యాకర ణా లలోనూ హనుమంతుడు మహాపండితుడడు. వివాహితు లకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమం తున కిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకుభంగం వాటిల్లలేదనీకూడా ఒక కధనం ఉంది. కొందరు హనుమంతుని 'ముఖ్య ప్రాణ దేవరు' గా ఆరాధిస్తారు. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతిన సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోఆలయం లో హనుమంతుని దర్శించుకుని,ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపాలు మెలిగి స్తే ,వారికిఆయుర్దాయం,సుఖసంతో షాలు, అష్టై శ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మిక .
హనుమంతుని తమతమ మొక్కులప్రకారం ఆలయాల్లో ఆకుపూజ చేయించడం,వడమాల, అప్పాల మాల వేయించడం , సింధూరం సమర్పించడం ,చేస్తుంటారు.భక్తితోపాటుగా త్యాగగుణం పెంపొందించు కోను ఈ కార్య క్రమాలన్ని నిర్దేసించబడ్డాయి. హనుమంతుడు బ్రహ్మచారి ఐనా ,హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ఇళ్ళలో లో పూజ చేసే భక్తులు,పూజా మందిరాన్నిశుభ్రం చేసుకుని అలంకరించుకుని ,పసుపు, కుంకుమ లు, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వు ల ను ఉంచుకుని , పూజిస్తారు. హనుమకు భక్తులు మంగళ , శనివారాల్లో అమితనిష్ట గా ,పూజించడం వల్లకోరినకోర్కెలు తీరటమేకాక ఆరోగ్యం చేకూరుతుంది. భక్తులు ముఖ్యంగా శనివారంనాడు హనుమాన్ చాలీసా ,ఆంజనేయ సహస్రనామాలు , హను మ చ్చరిత్ర వంటి వంటివి చదివి స్తుతిస్తారు ."ఓం శ్రీ ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామి వారికి అర్పిస్తారు..
మన దేశంలో హనుమన్ ఆలయాలు కోకొల్లలు.శృంగేరి లో ఆదిశంకరరా చార్యులవారు ప్రతిష్టిం చిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు. కర్నూలు లో అహోబిల –శ్రీ కరంజ ఆంజనేయ స్వామి దేవాలయంఉంది.ఈయనను ఆంజనే యుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజని సుతుడు , రామ భక్త వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదే శ్లో హనుమంతుని గుడి లేని ఊరేలేదనవచ్చు.
మన తెలుగునాట హనుమాన్ జంక్షన్ వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం.తణుకు దగ్గర తీపర్రు లో ప్రసన్న ఏకాదశముఖి వీరాంజనేయ స్వామి ఆలయం ,గురవాయిగూడెం మద్ది వీరాంజ నేయ స్వామి,విజయవాడలోదాసాంజనేయస్వామి, మాచవరం సురేంద్రపురి, యాదగిరి గుట్ట పంచ ముఖ హనుమదీశ్వరాలయం.తిరుమల లో కోనేటి గట్టు ఆంజనేయ స్వామి, బేడీ ఆంజనేయస్వామి, జాబాలి తీర్థం,రాజమండ్రి సుందర ఆంజనేయస్వామిదేవాలయం,కాకినాడ , మామిడాడ వద్ద పంచముఖ ఆంజనేయ స్వామిగుడి , అరగొండ- అర్ధగిరి ఆంజనేయస్వామి దేవాలయం, , చిత్తూరు జిల్లా లో భర్తి పూడి, బాపట్ల మండలం లో ప్రసన్నాంజనేయ స్వామి, కర్నూలు జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి, ప్రకాశం జిల్లావేటపాలెం, పొన్నూరు ఆంజనేయ స్వామి, సామర్లకోట ఆంజనేయస్వామి. ఆంజనేయపుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుం దని విశ్వాసం.
విదేశాల్లోనూ సైతం భక్తుల కొంగుబంగారమైన ఆంజనేయస్వామి ఆలయాలు అనేకం .
|