వాగుడుగుడు కుంచం ఉపన్యాసాల ఊకదంపుడు.. ఉద్వేగాల రెచ్చ గొట్టుడు! అదే పనిగా సొల్లు వాగుడు.. మంచి కోసం ముందుకు రాడెవడూ!!
సంకు "చిత్తం" కుల మత ప్రాంతీయ భావో ద్వేగాలు.. రాజకీయాలకు ఇవే ఆయుధాలు! సంకుచితత్వం తో పెరిగే రాగ ధ్వేషాలు... ప్రగతి పాలిట పెను విఘాతాలు!!
రైతు వెత
పంటకు గిట్టుబాటు ధర దక్కక.. పైసలు లేక ఎట్టా బతకాలో తెలియక... రైతన్న ఆత్మ త్యాగం చేస్తే గనక.. వ్యవస్థ తీరుకు ఇదో మచ్చు తునక!!