మేష రాశి
ఈవారం మొత్తంమీద గత కొంత కాలంగా మీరు పడ్డ కష్టానికి ఫలితం రావడం చేత సంతోషాన్ని పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అర్థికపరమైన విషయాల్లో మెరుగు ఉంటుంది కాకపోతే ఊహించని ఖర్చులు వారం చివరలో పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. బంధుమిత్రులతో మీ యొక్క ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పుట మంచిది. ఉద్యోగులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దలతో మంచి రిలేషన్ ఉంచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు ఉండే అవకాశం ఉంది కాకపోతే అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళ్ళుట మంచిది. కళారంగంలోని వారికి ఓపిక అవసరం అలాగే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది.
వృషభ రాశి
ఈవారం మొత్తంమీద బాగుంటుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయుట ద్వార మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. అకారణంగా విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. మిత్రులద్వారా వచ్చిన సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు అధికారుల వలన మేలుజరుగుతుంది. వారి నిర్ణయాలకు అనుగుణంగా మెలగడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు పెట్టుబడులు కలిసి వస్తాయి ఆశించిన విధంగా లబ్దిని పొందుతారు. కళారంగంలోని వారికి మంచి సమయం నూతన అవకశాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయవలసి రావొచ్చును కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు.
మిథున రాశి
ఈవారం మొత్తంమీద దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్ళుట వలన తప్పక విజయంను పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు కూడా పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త అవసరం. పెద్దలతో అభిప్రాయాలను పంచుకొనుట మంచిది. ప్రయాణాలకు సమయాన్ని ఇస్తారు కాకపోతే తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ఆరంభంలో కుటుంబపరంగా నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన. ఉద్యోగులకు అధికారుల వలన నూతన సమస్యలు వచ్చిపడే అవకాశం కలదు. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి నచ్చిన పనులకు సమయాన్ని ఇస్తారు. పెట్టుబడలు పెట్టుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది మిత్రుల ద్వారా నూతన అవకశాలు వచ్చుటకు ఆస్కారం ఉంది.
కర్కాటక రాశి
ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దల అబిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. నూతన నిర్ణయాలు కొంత వాయిదా వేసి వారం చివరలో ప్రయత్నం చేయుట వలన ఫలితాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యుల వలన స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట మంచిది. ఉద్యోగులకు బాగుండకపోవచ్చును సర్దుబాటు అవసరం, సమయపాలన మేలుచేస్తుంది. వ్యాపారస్థులకు ప్రతివిషయంలో నిదానం అవసరం లేకపోతే అనుకోని సమస్యలు పొందుతారు జాగ్రత్త. కళారంగంలోని వారికి పెద్దల సహాయ, సహాకారాలు అందుట వలన నూతన ప్రయత్నాలు లబ్దిని చేకూర్చే అవకాశం ఉంది. శ్రమను మాత్రం పొందుతారు ప్రయత్నం పెంచుట ఉత్తమం.
సింహ రాశి
ఈవారం మొత్తంమీద నలుగురిని కలుపుకొని వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. సేవచేయాలనే తలంపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది సమయానికి ధనం చేతికి అందుట వలన ఇబ్బంది ఉండదు. మాటలు పొదుపుగా వాడుట సూచన వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. పనులలో శ్రమను పొందినను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వారం మధ్యలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యుల ఆలోచనలు కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడేఅవకాశం ఉంది. అనుకున్న మార్పులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి . పెట్టుబడులు చేయుటకు మంచి సమయం. కళారంగంలోని వారికి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వాటిని వినియోగించుకొనే ప్రయత్నం చేయండి.
కన్యా రాశి
ఈవారం మొత్తంమీద ప్రతి ప్రయత్నం చేయునపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనుల విషయంలో సరైన ప్రణాలిక అవసరం లేకపోతే సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. పనులలో శ్రమను పొందుటకు ఆస్కారం ఉంది పనులు ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం కలదు. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు కాకపోతే వారి మాటతీరు మిమ్మల్ని భాదించే అవకాశం ఉంది, సర్దుబాటు విధానం లేకపోతే కొత్త కొత్త సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు పొందుతారు. పనిభారం తప్పకపోవచ్చును నిదానం అవసరం. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి నలుగురికి అనుగుణంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. నూతన పెట్టుబడులు వద్దు. కళారంగంలోని వారికి కుటుంబంలోని సమస్యలు ప్రతిబంధకాలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త.
తులా రాశి
ఈవారం మొత్తంమీద మధ్యలో ఉత్సాహంను కలిగి ఉండి పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుతారు. ప్రయాణాల వలన కొంత అలసిపోయే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఒకవార్త మిమ్మల్ని భాధకు గురిచేసే అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. పనులలో కొత్త సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. అధికారులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంబసభ్యుల మూలాన కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి స్త్రీ మూలక సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త నిదానంగా వ్యవహరించుట సూచన.
వృశ్చిక రాశి
ఈవారం మొత్తంమీద ఆరంభంలో పనులలో చిన్న చిన్న సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. వారం చివరలో కొంత అనుకూలమైన మార్పులు రావడం వలన కొంత ఊరటచెందుతారు. నూతన ప్రయత్నాలకు వారం చివర అనుకూలమైన సమయం. కుటుంబంలో స్వల్ప మార్పులు కలుగుటకు అవకాశం ఉంది వాటిని స్వాగతించుట వలన మేలుజరుగుతుంది. శుభాకర్యములలో పాల్గొనే అవకాశం ఉంది బంధుమిత్రులను కల్సుకొనే అవకాశం కలదు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో కలిసి చేపట్టిన పనులలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు లాభం ఉంటుంది నూతన పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కలదు. కళారంగంలోని వారికి బాగుంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన చర్చలలో పురోగతి ఉంటుంది పనులు ముందుకు సాగుతాయి.
ధనస్సు రాశి
ఈవారం మొత్తంమీద నచ్చిన పనులను చేపట్టుటకు ఉత్సాహంను చూపించే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని కొన్ని విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చుటకు అవకాశం ఉంది. నలుగురికి ఉపయోగ పడే పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళుట చేత లబ్దిని పొందుతారు. ఉద్యోగులకు ప్రణాలిక అవసరం అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వారి సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారస్థులకు బాగుంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. కొంత ఒత్తిడి ఉన్న ధనం చేతికి అందుతాయి. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు కలుగుతాయి నూతన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మకర రాశి
ఈవారం మొత్తంమీద ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, వాహనముల మూలన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. తమవర్గం అనుకున్న వారితో విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున సర్దుకుపోవడం సూచన. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం ద్వారా నూతన సమస్యలు పొందుటకు ఆస్కారం కలదు. మాటతీరు మూలాన కొంత నష్టపోయే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు పనిభారం ఉంటుంది అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయుటలో సమస్యలు తప్పక పోవచ్చును. వ్యాపారస్థులకు నూతన అవకశాలు పొందుతారు బాగానే ఉంటుంది. కళారంగంలోని వారికి మాములుగా ఉంటుంది కొంత సర్దుబాటు అవసరం. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.
కుంభ రాశి
ఈవారం మొత్తంమీద భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు, విందులలో వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమాయనికి పూర్తిచేసే అవకాశం ఉంది. మాటలు పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేయుట మంచిది. ఇష్టమైన వ్యక్తులకు సమయాన్ని కేటాయిస్తారు నచ్చిన పనులను చేపట్టుటకు ఆస్కారం కలదు. అనారోగ్యం కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో చర్చలు జరుపుటకు అవకాశం ఉంది మీ ఆలోచనలు వారికి తెలియజేయుట మంచిది. ఉద్యోగులకు స్వల్ప సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. అధికారుల మూలాన సమస్యలు తప్పక పోవచ్చును. వ్యాపారస్థులకు బాగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది.
మీన రాశి
ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమాయనికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తుల నుండి కొత్త సమాచారం పొందుతారు. ప్రయాణాలు చేయటకు అవకాశం ఉంది. సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుండి నూతన పనుల విషయంలో ఒక నిర్ణయనికి వస్తారు. స్థిరమైన ఆలోచనలు చేయుటకు ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నూతన ఆలోచనల విషయంలో పెద్దల అభిప్రాయాలను తీసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేయుట ద్వారా నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది.
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం
|