శ్రీరంగం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

శ్రీరంగం

శ్రీ రంగనాధ ఆలయం-శ్రీరంగం.
రామానుజాచార్యులవారు ప్రతిపాదించిన విశిష్టాద్వైత(శ్రీవైష్ణవ) సంప్రదాయానికి చెందినవారికి ఇది ప్రధానక్షేత్రం.ఇక్కడే 'విప్రనారాయణ'కథజరిగిందంటారు.నూటఎనిమితి దివ్యతిరుపతులలో ఒకటైన ఈక్షేత్రం అష్టస్వయంవక్తక్షేత్రాలలో ఒకటి.ఇక్కడి రాజగోపురం ఎత్తుడెభైరెండుమీటర్లు,ఆసియాఖండంలోకెల్లా పెద్దగాలిగోపురం ఇదే.ఇక్కడి స్వామి విగ్రహం చాలాపెద్దది శయనభంగిమలో దర్శనం ఇస్తుంది.కేరళలలోని పద్మనాభస్వామి,తిరుపతిలోనిగోవిందరాజులస్వామి, నెల్లూరులోని రంగనాయకస్వామి విగ్రహాలన్ని ఒకేకోవకు చెందినవే. తొలుత బ్రహ్మ కొలిచేఈ శ్రీరంగనాధుని ఇక్ష్వకవంశరాజులకు ఇచ్చాడు. రావణుని జయించిన శ్రీరామునితో అయోధ్యకు వచ్చిన విభీషణుడు లంకకు తిరిగివెళుతూ,శ్రీరంగనాధునివిగ్రహాన్ని కోరుకున్నాడు ఆలాగే ఆవిగ్రహాన్ని విభీషణునికిఇస్తు శ్రీరాముడు దారిలో ఎక్కడా ఈవిగ్రహాన్ని నేలపై ఉంచరాదు అన్నాడట. విభీషణుడు శ్రీరంగం చేరే సరికి ఆవిగ్రహాం విపరీతంగా బరువుపెరగడంతో మోయలేని విభీషణుడు నేలపై ఉంచాడు.
కావేరినది ద్వీపంలో ఈఆలయం ఉంది.ఈఆలయశిఖరం 'ఓం'ఆకారం లోఉంటుంది.ఇక్కడ బంగారు సీతాదేవిని చూడవచ్చు.ఇక్కడ అమ్మవారు రంగనాయకి స్వామివారికి కుడిభాగానఉండటం విషేషం
శ్రీరంగనాథస్వామిఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి.ఈ ఆలయంలోరంగనాథ స్వామి సన్నిధితో పాటు, 53 ఉప-సన్నిధులూ కూడా ఉన్నాయి.ధన్వంతరి సన్నిధి,గరుడాళ్వార్ సన్నిధి, ఉడయవర్ సన్నిధి,తాయారు సన్నిధి,హయగ్రీవార్ సన్నిధి ఉన్నవి.
కావేరి, కోలెరూన్ లేదా కొల్లిదంల ద్వారా రూపుదిద్దుకున్న ఓచిన్న ద్వీపంవద్ద ఈ ఆలయం వెలసింది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవిఆవరించిఉంటాయి.అన్నిప్రాకారాల్లోఉన్న21బ్రహ్మాండమైన స్తంభాలుసందర్శకులను ఆకట్టుకుంటాయి.ఈ ఆలయం వేల సంవత్సరాలనాటి ప్రాచీన నాగరికతనూ చాటి చెబుతుంది. కోరమండలం తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు. 13వ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ, అవి శాసనాలూ, భవనాలవరకూ మాత్రమే పరిమితమైపోయాయి.
ఆలయంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం జూన్-జులై మాసంలో ఈ జ్యేష్టాభిషేకం ఉత్సవం చేస్తారు. ఆ రోజున, ఆలయ గర్భగుడిని శుభ్రపరచి ఆలయంలో ప్రత్యేకంగా తయారుచేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూస్తారు. నామ్‌పెరుమాళ్, అమ్మవార్లబంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారు. అనేకమంది అర్చకులు, భక్తులు బంగారు, వెండి కలశాల్లో పవిత్ర జలాల్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి, బంగారు కలశాల్ని ఏనుగు మీద తీసుకొస్తారు. ఈ బంగారు కలశాన్ని 1734లో విజయనగర చొక్క నాయకర్ బహూకరించారు. ఆ తరువాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్ళారని, కానీ భగవంతుడి కృపవల్ల అది తిరిగి స్వాధీనమయిదని అనుకుంటారు. ఈ శాసనం ఆ బంగారు కలశం మీద తెలుగుభాషలో చెక్కించి ఉంది. ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి, ఆలయానికి తీసుకొస్తారు. కావేరి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్ఛారణలు హోరెత్తుతాయి. ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ “తిరువెన్నయలి ప్రాకారం’లో ఉంచుతారు. విగ్రహాలనుంచి బంగారు తొడుగుల్ని తొలగించి, జియ్యర్ స్వామీజీ, వధుల దేశికార్ స్వామిలకు అప్పగిస్తారు. ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగుపెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు.
నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన అని (ఆగస్టు- సెప్టెంబరు) లో పూజాదికాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో 365 సార్లు తిరువర్ధనం జరుపుతారు. రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరికోసం 1008 సార్లు తిరువర్ధనం జరుపుతారు. ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకూ అలంకరిస్తారు.

 

మరిన్ని వ్యాసాలు