వయోలిన్ విద్వాంసుడు - ambadipudi syamasundar rao

వయోలిన్ విద్వాంసుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు గారి పేరు ప్రముఖ వయోలిన్ విద్వాంసుడిగా తెలుగు వారికి సుపరిచితమైన పేరు అంతేకాకుండా చిన్నతనము నుండి సంగీతములో ఎంతో కఠోర సాధన వయోలిన్ పై చేయటము వలన దేశ విదేశాలలో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడిగా ఎనలేని కీర్తి గడించాడు.వారి తల్లిదండ్రులు, సోదరులు సంగీత విద్వాంసులు అవటం వలన చిన్నతనము నుండి సంగీతము ముఖ్యముగా వయోలిన్ పట్ల బాగా ఆకర్షితుడై నిరంతర సాధనతో ఆనతి కాలములోనే తన ప్రజ్ఞాపాటవాలతో పలువురి ప్రశంసలను అందుకున్నాడు. అయన వయోలిన్ పై వివిధ రాగాలను పలికించిన తీరు రసజ్ఞులను ఎంతగానో ఆకట్టుకునేది నేటికీ అయన గ్రామఫోన్ రికార్దులు టేపులు సంగీతాభిమానులు వింటూ అందిస్తున్నారు. అయన వయోలిన్ పై మొక్కజొన్న తోటలో వంటి జానపద గీతాల నుండి కదనా కుతూహల రాగములో రఘువంశ సుదాంబుధి వంటి సాంప్రదాయ గీతాలను, అలాగే తిల్లానా,భజన గీతాలను, జావళీలను పలికించే వారు.

ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నవంబర్ 8, 1893 లో బెంగుళూరులో జన్మించారు ఆయన తండ్రి వెంకటరాయుడు సైనిక దళంలో కమీషండ్ ఆఫీసరుగా పనిచేసారు.అయన విశాఖపట్నం లో పెరిగాడు 1919లో విజయనగరము మహారాజ వారి సంగీత కళాశాలలో విద్యార్ధిగా చేరి అదే కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడాలని వెళితే ఆనాటి ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆదిభట్ల నారాయణ దాసు గారు ఈయన ప్రతిభను గుర్తించి ఆయనను ఉపాధ్యాయుడిగా నియమించారు, అంటే 26 యేళ్ళ ప్రాయం లో విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా నియమితుడయ్యాడు.1936లో అదే కళాశాలకు ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొందారు. వారి హయములోనే విజయనగరం సంగీత కళాశాలకు ఎనలేని కీర్తి లభించింది ఎందరో సంగీత విద్వాంసులు అయన నేతృత్వములో తయారు అయినారు

సారంగి వాయిద్యం ఒంటరి కచేరీలు ( అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇవ్వడం ఈయనే ఆరంభించాడు. మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీ లోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో ఇతని కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఇతని వయొలీన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నారు ఇంటిలో విని ఎంతో ప్రశంసించాడు.అయన ద్వారం వెంకట స్వామి నాయుడుగారి ఫోటోను తన గదిలో అలంకరించుకున్నాని స్వయముగా చెప్పారు. అయన అభిమానుల్లో ఒకడినని ఆయనను అనుకరించేవాడినని యెహూది మెనుహిన్ చెప్పేవారు అంటే ద్వారం వెంకట స్వామి నాయుడు గారు ఎంతటి ప్రతిభావంతులో గుర్తించవచ్చు.భారత తోలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ,ప్రధాని నెహ్రు వంటి వారు ఈయన ప్రతిభను గుర్తించి తగు రీతిన సన్మానించేవారు.

ద్వారం వెంకటస్వామి నాయుడు సారంగి వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి. కర్ణాటక సంగీతం సారంగిపై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ఇతనే కావచ్చును. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశాడు. "తంబూరా విశిష్ట లక్షణాలు" అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం "వివిపించే తపస్సు" అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఇతను శిష్యులకు చెప్పేవాడు. - ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి - అని చెప్పేవాడు.

మద్రాసు సంగీత అకాడమీ 1941 లో ఇతనికి సంగీత కళానిధి అవార్డ్ ప్రధానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది.సంగీత కళా సాధనలో ప్రప్రధమముగా పద్మశ్రీ అందుకున్న తోలి వ్యక్తి ఈయనే. చెన్నైలో "శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి.1950లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. మైసూరు మహారాజా సంగీత రత్నాకర బిరుదుతో ద్వారం ను సత్కరించారు.ఈయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమించింది. ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షులుగా కొంతకాలము పనిచేశారు. ఆ విధముగా సంగీత కళానిధిగా విశేష ఖ్యాతి గడించిన ద్వారం వెంకట స్వామి నాయుడుగారు 1964 నవంబర్ 25 న గుండెపోటుతో హైదరాబాదు లో అశేష సంగీత అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి తుదిశ్వాస విడిచారు.

-

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు