
విజ్జేశ్వర పురం అనే ఓ దేశం వుంది. అధిపతి విరూపాక్షుడు. అతడిని ఐదేళ్లకోసారి ప్రజలే ఎన్నుకోవడం ఆనవాయితీ. విరూపాక్షుడికి విజ్జేశ్వరపురం ప్రజలు అంటే ఎంతో అభిమానం.
విజ్జేశ్వరపురం ప్రజలకు సైతం దేశాధిపతి అంటే మక్కువ. ఈ మూలంగానే విరూపాక్షుడిని గత ఇరవై ఏళ్లుగా ఆ దేశ ప్రజలు ఎన్నుకుంటున్నారు. దీంతో ప్రజలకు తాను మంచి చేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రజలు తమ మీద అపరిమిత విశ్వాసం చూపుతున్నారని భావించాడు.
ప్రజలు తన మీద విశ్వాసం చూపుతున్నారన్న ఆనందంలో దేశ అభివృద్ధిని మరిచాడు. వృథాగా కాలం గడిపాడు. . వారికి ఎలాంటి ఉపాధి, ఆదాయo వచ్చే మార్గాల గురించి ఆలోచించలేదు. దేశాధినేత తన కుటుంబ అభివృద్ధిని మాత్రం చూసుకున్నాడు. బాగా ఆస్తులు కూడబెట్టాడు. మళ్లీ ఎన్నిక రానే వచ్చింది.
ప్రజలు తమ అభివృద్ధిని మరిచినా మళ్లీ ఐదేళ్లు విరూపాక్షుడిని గెలిపించారు. అయితే ఈ సారి విజ్జేశ్వరపురం ప్రజలు ఆదాయ మార్గాలు లేక బాగా నష్టపోయారు. తినడానికే తిండి లేకుండా అలమటించసాగారు. ఈ పరిస్థితుల్లో విరూపాక్షుడికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
అష్టకష్టాలు పడుతున్న ప్రజలు పన్నులు కట్టలేదు. విజ్జేశ్వరపురానికి ఆదాయం లేక దివాలా తీసింది. ఇప4డు విరూపాక్షుడికి ఏమి చేయాలో దిక్కుతోచలేదు. పన్నులు చెల్లించాల్సిందేనని లేకుంటే శిక్ష తప్పదని ఆజ్జ జారీ చేశాడు.
విరూపాక్షుడి ఒత్తిడి భరించలేదని ప్రజలు ప్రజలు ఇతర దేశాలకు వలసపోసాగారు. ఇది గమనించిన విరూపాక్షుడు పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రజలు తమపై చూపిన ప్రగాఢ విశ్వాసానికి రుణం తీర్చుకోవాలనుకున్నాడు.
వెంటనే ప్రజలకు ఆదాయం వచ్చేలా పక్క రాజ్యాధిపతి వద్ద తన రాజ్య ప్రజలందరికీ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున తను హామీ ఇచ్చి రుణం ఇప్పించాడు.
డబ్బులు లేక అల్లాడుతున్న విజ్జేశ్వరపురం ప్రజలు ఇచ్చిన రుణాలను విలాసాలకు బాగా ఖర్చుచేశారు. అయిన పోయిన తర్వాత మళ్లీ పస్తులతో అలమటించసాగారు.
ఇచ్చిన రుణాలనికి వడ్డీ చెల్లించాలని ఆనందగజపతి ఒత్తిడి చేయడంతో వున్న రాజధానిని తాకట్టుపెట్టి వడ్డీ తీర్చి తాత్కాలికంగా రుణబాదను తీర్చుకున్నాడు. అయితే మళ్లీ రెండు, మూడు నెలలకే చేసిన అప్పుకు వడ్డీ రెండిరతలైంది. విరూపాక్షుడికి మనశ్శాంతి లేకుండా చేసింది. ప్రజలకు మంచి చేయాలని చూస్తే ఇలా కీడు ఎదురైంది ఏమిటి? అని లోలోన కుమిలి పోసాగాడు. ప్రజల విశ్వాసానికి తగిన రుణం తీర్చుకున్నానని ఆనందించిన అతనికి సంతోషం ఆవిరై పరీక్షగా మారింది.
ఇటో ప్రజలకు అష్టకష్టాలు తప్పలేదు. ఇక చేసేదేమీ లేక ఆనందగజపతి వద్ద పరిశ్రమలో పనికి కుదిరాడు విరూపాక్షుడు.. వచ్చిన ధనంతో తన రాజ్యంలోనే చిన్న వస్త్ర తయారీ పరిశ్రమను స్థాపించాడు. ప్రజలకు పని కల్పించాడు. ప్రజలకు ఆదాయం వచ్చింది. విరూపాక్షుడు ఆ వస్త్రాలను ఇతర రాజ్యాలయలలో అమ్మి లాభాలు ఆర్జించాడు. నెమ్మదిగా విజ్జేశ్వరపురంలో రకరకాల పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఆదాయం వచ్చే ఉపాధి చూపాడు. కొద్ది రోజుల్లోనే లాభాలు వచ్చి చేసిన రుణాలు తీరిపోయి ఆర్థికంగా బాగా పుంజుకున్నాడు. ప్రజలకు చేతినిండా పనులు దొరికి హాయిగా సుఖశాంతులతో జీవించసాగారు. ఇప్పుడు ప్రజలు తనపై చూపిన విశ్వాసానికి నిజంగా రుణం తీర్చుకున్నాడు. నిశ్చింతగా రాజ్య బాధ్యతలు నిర్వర్తించసాగాడు విరూపాక్షుడు.