నవరస నటుడు కె. సత్యనారాయణ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నవరస నటుడు కె. సత్యనారాయణ .
కైకాల సత్యనారాయణ .
తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో ఉన్న ఆయన దాదాపు 800 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.
సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనుకు ఒక పాత్రవచ్చింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమ సింహం ,బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.
1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
కైకాల సత్యనారాయణ నటించిన సినిమాలు
• సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా)
• లవకుశ (1963)
• పాండవ వనవాసం (1965)
• పరమానందయ్య శిష్యుల కథ (1966)
• ప్రేమనగర్ (1971)
• తాతా మనవడు (1973)
• నిప్పులాంటి మనిషి (1974) - షేర్ ఖాన్
• జీవన జ్యోతి (1975)
• సిరిసిరిమువ్వ (1976)
• సెక్రటరీ (1976)
• చక్రధారి (1977)
• దాన వీర శూర కర్ణ (1977) - భీముడు
• యమగోల (1977) -యముడు
• శుభలేఖ (1982) - అంకెల ఆదిశేషయ్య
• శ్రుతిలయలు (1987) - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
• రుద్రవీణ (1988)
• నారీ నారీ నడుమ మురారి (1990) - జానకిరామయ్య
• సూత్రధారులు (1990) - నీలకంఠయ్య
• గ్యాంగ్ లీడర్ (1991) - జైలర్
• భైరవ ద్వీపం (1994)
• ముద్దుల ప్రియుడు (1994)
• యమలీల (1994) - యముడు
• ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
• సాహసవీరుడు - సాగరకన్య (1996)[6]
• సూర్యవంశం (1998)
• శుభాకాంక్షలు (1998) - సీతారామయ్య
• సమరసింహారెడ్డి (1999)
• మురారి (2001)
• అరుంధతి (2009)
• నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
• నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
• కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
• నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.
• 28 పౌరాణిక చిత్రాలు
• 51 జానపద చిత్రాలు
• 9 చారిత్రక చిత్రాలు
• 200 మంది దర్శకులతో పనిచేసాడు
• 223 సినిమాలు 100 రోజులు ఆడాయి
• 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
• 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
• 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి.
• యస్ .వి .రంగరావు గారి అనంతరం ఆస్ధానాన్ని అందుకున్న ఇంతటి టి సిని నటజీవితం గడీపిన ఈ మహానటునికి పద్మశ్రీ రాకపోవడం సోచనీయం .

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్