కాశీ ప్రయాణ కథలు - విధూషకుని చమత్కారం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - vidushakuni chamatkaram

కాశీ ప్రయాణ కథలు - విధూషకుని చమత్కారం.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

" సోదరులారా ఈరోజు మీకు విదూషకుని చమత్కారం అనే కథ చెపుతాను ...

మాళవ దేశాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తుండే వాడు ,అతని మంత్రి పేరు సుబుధ్ధి. బ్రహ్మదత్తుని ఆస్ధానంలో విభుదయ్య అనే విధూషకుడు ఉండేవాడు.

ఒకరోజు బ్రహ్మదత్తుడు ' సభాసదులారా నేడు మనలను అనునిత్యం ఆనందపరిచే విభుదయ్య గారి జన్మదినం ఆసందర్బంగా వారిని ఘనంగా సత్కరించ దలచాము విభుదయ్య గారిపై సభాసదుల అభిప్రాయాలను సేకరించ దలచాము సభామండపంలో తాళపత్రాలు, పెద్ద వెండిపాత్ర ఏర్పాటు చేసాము సభాసదులంతా విభుదయ్య గారిపై మీకున్న అభిప్రాయాన్నిరాసి ఆపాత్రలో వేయండి 'అన్నాడు.

సభలోని వారందరు విభుదయ్యపై తమకు ఉన్న అభిప్రాయాన్ని రాసి పాత్రలోవేసారు.

' మంత్రివర్యా పాత్రవద్ద ఏర్పాటు చేసిన ఆసనంలో తమరు కూర్చొని సభికులు రాసిన అభిప్రాయాలను సభకు వినిపించండి ' అన్నాడు రాజు.

మంత్రి ఒక్కో పత్రాని చదివి సభలోనివారందరిని ఆనందపరుస్తూ ,ఓతాళపత్రం చేతిలోనికి తీసుకుని మౌనం వహించాడు. ' మంత్రివర్యా ఏం మౌనం హించారు తమకు తెలితని భాషలో రాయబడిందా ఏది ఇలా ఇవ్వండి అని మంత్రి చేతిలోని తాళపత్రం తనచేతిలోనికి తీసుకున్న రాజు

ఆతాళ పత్రంలో పరమ శుంఠ అని ఉంది ' ఏమిటి ఈ ఉన్మాదపు రాతలు 'అన్నాడు.

రాజుగారి చేతిలోని పత్రం తీసుకున్న విధూషకుడు " ప్రభూ ఈ వ్యక్తి ఎవరో నాగురించి రాయమంటే తన గురించి రాసాడు "అన్నాడు . సభలోని వారంతా ఘొల్లుమంటూ కరతాళధ్వనులు చేసారు, సభాసదులతోపాటు నవ్వున రాజుగారు ' విభుదయ్య మీసయస్ధూర్తి అభినందనీయం ' అని విధూషకుని ఘనంగా సత్కరించాడు ' అన్నాడు శివయ్య .

కథ ముగియడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.