కాశీ ప్రయాణ కథలు - నారు పోసిన వాడు.. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - Naru Posinavadu

కాశీ ప్రయాణ కథలు - నారు పోసిన వాడు..

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమ పెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను కావిళ్ళలో పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి కాలినడకన బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామం చేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయం వెలుపల మండపంలో విశ్రమించారు.

మీకు ఈరోజు నారు పోసినవాడే ..... అనేకథ చెపుతాను ...

శ్రీరంగ పురం అనేగ్రామంలో కృష్ణమూర్తి, రుక్మిణి అనే బ్రాహ్మణ దంపతులు కడు పేదరికంలో నివశిస్తుండేవారు ఒకరోజు ... " ఈపూట వంట చేయడానికి సరుకులు నిండుకున్నాయి "అన్నది రుక్మిణి.

" ఒకరోజుకు సరిపడా వంట సరుకులు రాసి చేతి సంచి ఇవ్వు ,రంగయ్య కిరాణా అంగడికి వెళతాను ,అలాగే రేపు వేకువనే తొలి బస్ కు బస్తి వెళ్ళడానికి చార్జిలకుగాను యాభై రూపాయలు చేబదులు అడిగి చూస్తాను "అన్నాడు కృష్ణమూర్తి.

రుక్మిణమ్మ అందించిన చేతి సంచి అందుకుని రంగయ్య అంగడి చేరిన కృష్ణమూర్తి " షావుకారు గారు ఈ కాగితంలో రాసిన సరుకులు అరువుగా ఇవ్వండి రేపు ఉదయం బస్తి లోని ఆలయంలో పూజారి అవసరం అని తెలిసింది ఓపర్యాయం వెళ్ళి రావాలీ అనుకుంటున్నాను ఆపని దొరికితె రెండుపూటలా ఇంత ప్రసాదం అయినా దొరుకుతుంది " అన్నాడు.

రెండు అరటి పండ్లు వంద నోటు తాంబూలంలో పెట్టి ,కృష్ణమూర్తికి అందించిన రంగయ్య " స్వామి ఎల్లుండి నా మనవడి తొలి పుట్టిన రోజు అపండడుగ ఎలా చేయాలో సూచన చేయండి అందుకుగాను సంభావన ఇది,తమరు మా ఇంట భోజనానికి రారుకనుక మీరు అడిగిన సరుకులు తమకు మోయనంగా ఇచ్చుకుంటాను " అని చేతులు జోడించాడు.

పంచాగం చూసిన కృష్ణమూర్తి వివరంగగా రంగయ్యకు తెలియజేసి బయలుదేరాడు.

' ఓరే గణపతి ఓహస్తం అరటి పళ్ళు అయ్యోరి చేతీ సంచిలోవేసి, ఆసరుకు అయ్యోరి ఇంటికాడ చేర్చిరా "అన్నాడు రంగయ్య.

మధ్యాహన్నం భోజనంలో ముద్దపప్పు, టమోట రోటిపచ్చడి, పొట్లకాయ పులుసు,నాలుగు నేతి చుక్కలు,గడ్డపెరుగుతో భోజనం ముగించిన కృష్ణమూర్తి పొట్టబరుతో భారంగా అడుగులు వేసుకుంటూ వీధి అరుగు పై ఉన్న పడక కుర్చిలో కూర్చున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చి నాలుగు వక్కపలుకులు చేతిలో పెట్టి తాంబూలం అందించివెళ్ళింది. విసిన కర్రతో ఎండ వేడినుండి ఉపశమనం పొందుతూ తాంబూలం నములుతూ తనకు తెలియకుండానే నిద్రపోయాడు కృష్ణమూర్తి.

వీధిగుమ్మం వద్ద అలికిడి కావడంతో ఉలిక్కిపడి నిద్రలేస్తూనే వీధిగుమ్మవపు చూసాడు. ఊరి పెద్దలు ,ప్రసిడెండు తదితరులు అంతారావడం చూసి కంగారు పడుతూ " రండి రండి ఏమిటి విషేషం పెద్దలంతా ఒక్కటిగా వచ్చారు " అన్నాడు వినయంగా.

" స్వామి మమ్మల్ని,మాఊరును నమ్ముకొని ఓ అర్చక కుటుంబం ఉన్నది మేము గుర్తించలేక పోయాము ,ఊరి పిల్లలు అందరిని సాయంత్రం తమఇంటిపంచలో పాఠలు ఉచితంగా వల్లే వేయించినా గుర్తించలేకపోయాము తమరు బస్తి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారని షావుకారు రంగయ్య చెపితె తెలిసింది ,మమ్మల్ని క్షమించండి మాన ఊరిలో శ్రీకృష్ణని దేవాలయం నిర్మించాలని ఈరోజునిర్ణయించాము, ఆలయ నిర్మాణము తమచేతులు మీదగా జరగాలి దగ్గరలో మంచి ముహుర్తం చూడండి ఆ ఆలయ పూజారిగా తమరే ఉండాలి నెలకు పదివేలు జీతం ఇదిగో మొదటినెల జీతం " అని తాంబూలంలో ఉంచి కృష్ణమూర్తికి అందించాడు ఆఊరి ప్రసిడెంట్ " కృష్ణ ఇన్నాళ్ళకు నాపైన దయకలిగిందా " అంటూ చేతులు జోడించి నమస్కరించి ఊత్తరీయంతో కళ్ళు అద్దుకున్నాడు. వీధి గుమ్మం ముందు ఎడ్లబండ్లు ఆగడంతో "అమ్మ రుక్మిణమ్మ తల్లి మాపాలేర్లు పది బస్తాల ధాన్యం,కందులు,మినుములు, నూనెడబ్బలు నిత్యావసర సరుకులు సమస్తం ఇహనుండి మేమే మీకు గౌరవంగా అంద జేసుకుంటాం ,స్వామి మనం కష్టకాలంలోనే ధైర్యంగా ఉండాలి , నారు పోసినవాడు నీరు పోయడాధైర్యంగా ఉండండి సెలవు " అంటూ ఊరి పెద్దలు వెళ్ళిపోయారు.

ఎడ్లబండిలో వచ్చిన నిత్యవసర సరుకులతో ఇల్లంతా నిండిపోయింది.

మడికట్టుకు వచ్చిన రుక్మిణమ్మ శ్రీకృష్ణుని విగ్రహనికి హరతి ఇస్తుంది.

ఇంట్లోకి వెళ్ళిన కృష్ణమూర్తి చేతిలో ధనం దేవుని ముందు ఉంచి సాష్ణాంగ నమస్కారం చేసాడు. ' నారు పోసినవాడే నీరు పోసాడండి ' అన్న రక్మిణి మాటలు అమృత వాక్కులా వినిపించాయి కృష్ణమూర్తికి " అన్నది సరస్వతి.

కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.