కుంతిదేవి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కుంతిదేవి.

కుంతీదేవి .
మహాభారతంలో పాండవుల తల్లి. పాండురాజు భార్య. కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే కర్ణుడు .
కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము కనుక అందుచేత ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది.
తన తండ్రి కుంతిభోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు పాండురాజును వివాహం ఆడింది కుంతి. పాండురాజు రాజ్యపాలన అనంతరం..
పాండురాజు కుంతి,మాద్రిలను వివాహం చేసుకున్నాడు. మునిశాపంచే స్త్రీ సాంగత్యతో మరణం ఉందని సంతానాన్ని పొందలేక పోయాడు.
కుంతి దేవి దుర్వాసుని మంత్రంద్వారా ధర్మరాజు ,భీముడు ,అర్జునుడుకుంతికి ముగ్గురు పుత్రులు పుట్టారు. పాండురాజు తనకు కూడా ఈ అభిప్రాయముందని చెప్పి ఓదార్చి కుంతిని పిలిచి అశ్వని దేవతలను ఆహ్వానించి మాద్రికి సంతానం ప్రసాదింపచేయమని ఆదేశిస్తాడు. కుంతి ఆ పనిచేసింది. మాద్రికి కవలలు జన్మించారు. మాద్రికి సంతానాపేక్ష మిక్కుటంగా ఉంది. ఒక్క కొడుకుతో తృప్తి పడక, మరొక సారి కుంతినడిగితే ఆమె ఏమంటుందో ఒకేసారి దేవ వైద్యులను ఇద్దరిని పిలిపించి, కవలలు కలిగేలా చేశాడు పాండురాజు. ఆ బిడ్డలు నకుల సహదేవులు. కుంతికి ముగ్గురు, మాద్రికి ఇద్దరు వెరసి ఐదుగురయ్యారు. మదనతాపానికి లోనైన పాండురాజు మాద్రితో సంగమించాడు.వద్దు, వద్దు అని మాద్రి వారించింది. రాజు వినిపించుకోలేదు. అంతే బాణపు దెబ్బతో తృళ్ళిపడ్డ జింకవలె విగత జీవుడై పడిపోయాడు పాండురాజు. మాద్రి సహగమనంచేసింది.
కురుక్షేత్ర యుధ్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుని సలహామేరకు
కుంతీ కర్ణుని కలవడానికి వెళ్ళి' నాయనా! నీవు నా కుమారుడవు. పాండవులు నీకు సోదరులు ' అని జరిగిన వృత్తాంతమంతా వివరించింది. కనుక నీవు పాండవులకు హాని కలుగ చేయవద్దని కోరింది. కర్ణుడు హాని చేయనని మాట యిచ్చాడు. కుంతికి.

 

మరిన్ని వ్యాసాలు