మా కోసం..! మా..అమ్మా యి..!! - డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

మా కోసం..! మా..అమ్మా యి..!!

మాకోసం ....! మాఅమ్మాయి ...!! (వ్యాసం) ఆడపిల్ల అనగానే అనేక కుటుంబాలలో  మరీ చిన్న చూపు. అది ఇంట్లో తల్లి దండ్రులతోనే ప్రారంభంకావడం మరీ విశేషం. ఆడ పిల్ల అంటే చిన్న పిల్లగా వున్నప్పటినుంచే అన్నిరకాలుగానూ వివక్షత చూపించే కుటుంబాలు ఇప్పటికీ ఉండడం దురదృష్టకరం. ఆహరం దగ్గరనుంచి ,బట్ట లు,చిన్న చిన్న కోర్కెలు ,చదువు ,ఇలా అన్నింటి విషయంలోనూ” ఆడపిల్లవు నీకెందుకు ? ‘’అనే ప్రశ్న ,బాణమై గుచ్చుకుని సున్నితమైన హృదయాలకు గాయం చేస్తాయి. పెళ్లి విషయం వచ్చేసరికి మరిన్ని సమస్యలు స్వాగతం పలుకుతాయి. అయితే ఇది అందరికీ వర్తించదు, కానీ చాలామందిలో ఉంటుంది.  ఈ రోజుల్లో ఆడ - మగ అంటూ తేడా ఏమీ లేదు ,ఒక లింగభేదం తప్ప.  మాకు రెండవ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో పండగ చేసుకున్నంత పని చేసాం. చిన్నప్పటి నుంచి ఆమెను వేరుగా కాదు ప్రత్యేకంగా పెంచాము. ఇద్దరు పిల్లలిని సమానంగా పెంచాము,చదివించాము.  అనుకోని రీతిలో అబ్బాయి పై చదువులకోసం అమెరికా వెళ్ళాడు. నాకు ఇష్టం లేకపోయినా అబ్బాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ,నేను రాజీపడ్డాను. కానీ మానసిక వ్యధకు గురి అయ్యాను. అన్న బాటలోనే చెల్లెలు కూడా అమెరికా వెళ్లి అక్కడ తన ముఖ్యాంశం ‘ జెనెటిక్స్ ‘ లో పరిశోధన చేసి అక్కడే స్థిరపడిపోవాలనుకుంది. కానీ నా మానసిక పరిస్థితిని అంచనా వేసింది.డిగ్రీ లో ఉండగా అనుకున్ననిర్ణయం పోస్ట్-గ్రాడ్యుయేషన్ కు వచ్చేసరికి మనసు( నిర్ణయం)మార్చేసుకుంది. తానూ ఎక్కడికీ పోననీ,ఉద్యోగం చేసినా,పెళ్లిచేసుకున్నా,మాకు దరిదాపుల్లోనే ఉంటానని హామీ ఇచ్చింది.నా(మా)కోసంత్యాగం చెయ్యొద్దని చెప్పినా వినిపించుకోలేదు.చదువు పూర్తి అయింది, ఉద్యోగం సంపాదించుకుంది,మొదట సా ఫ్ట్ వేర్..సంబంధాలు చూడొద్దన్నఅమ్మా యి, మాకు దగ్గరగాఉండడం కోసం సాఫ్ట్ వేర్, అబ్బాయినే ఎంచుకుని పెళ్లి  చేసుకుంది.ఉద్యోగంలో భాగంగా మొదట నిజామాబాద్ పోస్టింగ్ వచ్చింది. కలలో కూడా ఊహించని  రీతిలో ఒకసంవత్సర కాలంలోనే తన వూరు వరంగల్ కు బదిలీ అయి వచ్చేసింది.తల్లిదండ్రులుగా మాఆనందానికి కొలబద్ద లేకుండా పోయింది.అమెరికాలో వున్న అన్న సూచనలతో సర్వం తానెఅయి, మా ..సంరక్షకురాలి అవతారం ఎత్తింది.తన చిన్నారి కూతురితో పాటు మేము ఇప్పుడు ఆమెకు ముగ్గురు పిల్లలం తయారయ్యాము. కరోనా..వచ్చింది,’’ మీరెవరూ ఇల్లు కథలడానికి వీలు లేదు’’ అన్నది. లాక్ డౌన్ మార్గ దర్శక సూత్రాలు పాటిస్తూ,తన ఉద్యోగ బాధ్యతలు క్రమశిక్షణతో నిర్వహిస్తూ,ఇంట్లో మాకు కావలసినవన్నీ సమకూరుస్తూ కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడు కుంటున్నది మాకూతురు,.ఈపని మగాళ్లు మాత్రమే చేయాలి/చేస్తారు,అన్న పాత చింతకాయ పచ్చడి కబుర్లకు భిన్నంగా ఆమె నిత్యాకార్యక్రమాలు నిష్టగా,ధైర్యంగా,చేసుకుం-- టూ పోతున్నది.అందుకే ఆడపిల్లలు కూడా ఉండాలి,ఇల్లు ఆనందానిలయంగా మారాలి.ఇది నా కూతురుగురించి మాత్రమే కాదు,ఇలాంటి కూతుళ్ళున్న అదృష్టవంతులైన తల్లి దండ్రులు ఎంతోమం ది మ న సమాజంలో వున్నారు.అందుచేత ఆడపిల్లలను తక్కువగా అంచనా వేయవలసిన కాలం కాదిది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే ,మా జీవిత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కనీ, వినీ ,ఎరుగని ,సమస్య ,సామాన్యుడినుంచి , సామ్రాట్టులను ,వారి జీవితాలను అతలాకుతలం చేసింది ‘ కోవిద్ -19’ అంతేకాదు మనిషి జీవితంలో తెలుసుకోవలసిన విషయాలను తెలియ జెప్పింది . ఎలా చెబితే మనిషి వింటాడో ఇప్పుడు అందరికీ అర్ధం అయింది పెద్దవాళ్ళ శేష జీవితంలో పిల్లలు ఎలా ప్రవర్తించాలో ముందుగానే తెలియ జెప్పింది . పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ,జలుబు , జ్వరం ,దగ్గు ,వంటి సమస్యలు వున్నవాళ్లు బయటి ప్రపంచంలో ఎలా  మసులుకోవాలో ,రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో ,నిత్యం  నడక ,వ్యాయామం ,యోగా ,అవసరం ఎంత ఉందొ ,భౌతిక దూరం ఆవశ్యకత ఎలాంటిదో ,మాస్క్ ఎందుకు ,ఎలా ,వాడుకోవాలో ,మొదలైన  ముఖ్య అంశాలను మనిషి కి అవగాహన కలిగే పరిస్థితిని తీసుకు వచ్చింది . ఇలా మనిషికి జ్ఞానోదయం అయ్యే పరిస్థితిని కలిగించింది .  అపారమైన ప్రాణ నష్టం జరిగినప్పటికీ ,భవిష్యత్తులో ఇలాంటి విపత్తులకు  ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపింది . శానిటైజర్ విలువ తెలిసింది . మనిషి జాగ్రత్త తప్ప ,మందులతో పెద్దగా పనిలేదని స్పష్టం చేసింది . బయటి నుండి తెచ్చిన వస్తువులపట్ల తీసుకొనవలసిన జాగ్రత్తలు , ఆవిరి పట్టడంలో అంది వచ్చే ఆరోగ్యం గురించి గుచ్చి .. గుచ్చి ,మరీ  చెప్పింది .  ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి నెల నుండి నన్ను గేటుకూడా దాటకుండా కట్టడి చేసింది మా అమ్మాయి . నా ప్రాక్టీసుకి  గుడ్ బై చెప్పించింది .  మార్కెట్టు ఎరగని మా అమ్మాయి ,సూపర్ బజార్ చూడని అమ్మాయి  అన్నీ తానె చేసుకుంటోంది .ఇంటి నుండే పని చేసే సౌకర్యం ఉండడం వల్ల అల్లుడు వినోద్ కూడా మాతోనే ఉండడం వల్ల అమ్మాయి అప్పుడప్పుడు  అతని సహకారం తీసుకుంటూ ,సర్వం తానై పని చేసుకోవడం ఇప్పటికీ  నాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది . అప్పుడప్పుడు పని అంతా తన  భుజాలమీద మోపుతున్నాననే గిల్టీ ఫీలింగ్ కూడా వస్తూనే వుంది . అయినా ఏమీ చేయలేని పరిస్థితి . అమ్మాయి ప్రేమలో ఇలా ఆనందంగా గడిపేస్తున్నాం . ఉద్యోగ రీత్యా ఇప్పటివరకూ మా అమ్మాయి మా దగ్గర ఉండడం ,దానికి మా అల్లుడు సహకరించడం ,నిజంగా మా అదృష్టమే ! ఇంతకీ మా అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా !ఆకాశవాణి ,వరంగల్  కేంద్రంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న,నిహర. కానేటి ,మా అల్లుడు  వినోద్ కుమార్ నల్లి (ఇన్ఫోసిస్ )."ఇద్దరు కొడుకులకు సమానం మా అమ్మాయి .. !"అని చెప్పడం ఇక్కడ అతిశయోక్తి కానే కాదు ! ***