నేడు గణతంత్ర దినోత్సవం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నేడు గణతంత్ర దినోత్సవం .

గణతంత్ర దినోత్సవం.
జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు.
1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతి వేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి1949వరకూఈబృందం భారతపార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశరాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు.